Tollywood Industry Totally Trapped in Drug Mafia

Drug racket dealings with tollywood out

Hyderabad, Hyderabad Drug Racket, Tollywood Drug Mafia, Tollywood Names Drug Racket, Akun Sabharwal Tollywood Drug Mafia, Tollywood Celebs Drug Mafia, Drug Mafia Busted

After the drug Racket bust in Hyderabad by ED Akun Sabharwal, emails, WhatsApp groups and call details of the three arrested were being analysed by officials to track the modus operandi of the peddlers, officials said.Drug game becomes child's play, tentacles trap Tollywood, MNCs

డ్రగ్స్ మత్తులో టాలీవుడ్.. పేర్లు చెప్తారా?

Posted: 07/03/2017 09:29 AM IST
Drug racket dealings with tollywood out

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ మాఫియా లింకులు సంచలనం సృష్టిస్తున్నాయి. అత్యంత ఖరీదైన మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాదు పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో ఎక్సైజ్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ మాట్లాడుతూ.. డ్రగ్ ముఠా సభ్యులకు సినీ పరిశ్రమకు చెందిన కొందరితో సంబంధం ఉందని చెప్పటం విస్మయానికి గురి చేస్తోంది. అంతేకాదు డ్రగ్‌ రాకెట్‌ తో సినీ పరిశ్రమ సంబంధాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పటంతో కలవరపాటు మొదలైంది.

పట్టుబడిన ముగ్గురూ ఉన్నత విద్యావంతులని, ప్రఖ్యాత ఎమ్మెన్సీ కంపెనీల్లో పనిచేస్తూ, లక్షల్లో జీతాలు పొందుతోన్న వారేనని అన్నారు. ముగ్గురూ సరఫరా చేసే డ్రగ్స్ ఒక్కో చుక్క కొన్ని వేల రూపాయల ఖరీదు చేస్తుందని ఆయన అన్నారు. వారి నుంచి 700 యూనిట్ల ఎల్‌ఎస్‌డీ, 34 గ్రాముల ఎండీఎంఏ ను స్వాధీనం చేసుకుని, సీజ్‌ చేశామని ఆయన తెలిపారు. గతంలో డ్రగ్ మాఫియాతో లింకులతో పలువురు జైలుపాలుకాగా, మరికొందరు ఆ ఆరోపణలను తోసిపుచ్చారు.

ఈ ముఠాతో ఎంతమందికి సంబంధాలున్నాయి? ఎంతమందికి సరఫరా చేశారు? ఎక్కడెక్కడ అమ్మారు? అన్న విషయాలపై వివరాలు సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. కాల్ లిస్ట్ ఆధారంగా వారిని విచారించే అవకాశం ఉంది. అయితే టాప్ సెలబ్రిటీల పేర్లు కూడా ఇందులో ఉన్నట్లు మీడియాకు ఉప్పందటంతో ఆ పేర్లు బయటకు రాకుండా జాగ్రత్తగా విచారణ చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Drug Mafia  Akun Sabharwal  

Other Articles