Vishal Bold Tamil Speech in Kannada Land

Vishal speaks up for tamil rights in karnataka

Kollywood Actor Vishal, Vishal Reddy Controversial Speech, Vishal Guts, Raghuveer Audio Launch, Vishal Raghuveer Audio Launch, Vishal Comments Kannada, Vishal karnataka, Actor Vishal Kauvery Water

Kollywood Actor Vishal speaks up for Tamil rights, in Karnataka. Bold speech in Bengaluru Raghuveer audio launch for Kauvery water create rucks.

కన్నడ గడ్డపై విశాల్ కాంట్రవర్సీ స్పీచ్.. ఏమౌతుందో?

Posted: 07/01/2017 06:03 PM IST
Vishal speaks up for tamil rights in karnataka

కోలీవుడ్ హీరో విశాల్ సినిమాల్లోనే కాదు.. బయట కూడా డేరింగ్ అండ్ డాషింగ్ ఫీట్ లతో వార్తల్లో నిలవటం తెలిసిందే. అతని ధైర్యసాహసాలు అందరికీ తెలిసినవే. అనుకున్న దానికోసం ఎంతటి సాహసమైనా చేసే విశాల్... తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎలా ఓడించాడో ప్రత్యక్షంగా చూశాం. అయితే తమిళ స్టార్ హీరోలైన రజనీ, కమల్ కూడా చేయలేని ఓ పనిని విశాల్ చేసి చూపించాడు.

అసలు విషయానికి వస్తే.. కావేరీ జలాల కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వాటర్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడో చెన్నైలో సత్యరాజ్ కన్నడగుడిలను అవమానించాడంటూ బాహుబలి2 ని రిలీజ్ కానీవ్వమంటూ చేసిన రచ్చ గుర్తుంది కదా. చివరకు సత్యరాజ్ సారీ చెప్పేసరికి అప్పుడు అనుమతి ఇచ్చారు. అసలు కోలీవుడ్ సీనియర్లు కూడా ఈ టాపిక్ పై మాట్లాడేందుకు జంకుతుంటారు. కానీ, విశాల్ మాత్రం ఏకంగా కర్ణాటకకు వెళ్లి కావేరీ జలాల కోసం గళం విప్పాడు.

బెంగళూరులో జరిగి ఓ కన్నడ సినిమా ఆడియో ఫంక్షన్ కు హాజరైన విశాల్ మాట్లాడుతూ, కావేరీ జలాల గురించి ప్రస్తావించాడు. అంతేకాదు పూర్తిగా తమిళ్ లోనే ప్రసంగించి షాకిచ్చాడు కూడా. ‘నీళ్లు అడగడం మా హక్కు అని... దాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. తమిళం మాట్లాడటం నాకెంతో గర్వకారణంగా ఉంటుంది. మాట్లాడకుండా నన్ను ఎవరూ ఆపలేరు. మనమంతా భారతీయులమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కర్ణాటకలో ఉన్న తమిళులను మీరు కాపాడండి. అలాగే, తమిళనాడులో ఉండే కన్నడిగులను మేము రక్షిస్తాం’ అని చెప్పాడు.

ఫంక్షన్ ముగిసిన తర్వాత కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ తల్లికి నివాళి అర్పించేందుకు ఆయన ఇంటికి వెళ్లాడు విశాల్. మరి స్టార్లు కూడా చేయని ఫీట్ చేసిన విశాల్ తన వ్యాఖ్యలతో ఎంత దుమారం రేపబోతున్నాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Vishal  Kannada  Kauvery water  

Other Articles