Neetu Chandra shows intrest to act in Sangamitra నీతూచంద్ర.. శృతి హాసన్ స్థానాన్ని అక్రమించేనా..?

Neetu chandra likes to replace shruti hassan in sangamitra

neetu chandra asks for shruti hassan place, neetu chandra likes to replace shruti hassan, neetu chandra show intrest to play sangamitra role, Neetu Chandra, sangamitra, shruti hassan, priyanka chopra, deepika padukone, tamannah, Garam Masala, Mithila Makhaan, fitness freak, facebook

Popular actress-turned-entrepreneur Neetu Chandra has lost as much as 11 kilos in the last two months by adopting the natural methods of losing weight.

గోదావరి బ్యూటీకి భారీ బడ్జెట్ చిత్రం అవకాశం దక్కేనా.?

Posted: 06/02/2017 06:44 PM IST
Neetu chandra likes to replace shruti hassan in sangamitra

బాహుబలి 2 చిత్రం ఇండియన్ సినిమాల చరిత్రను తిరగరాయడంతో ఇక అదే తరహా చిత్రాలకు మరికొంత మంది నిర్మాతలు, డైరెక్టర్లు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారీ బడ్జెట్ తో హీరోయిన్ ప్రధానప్రాతలో తెరకెక్కనున్న చిత్రం 'సంఘమిత్ర'. ఇలా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను నిర్మాణ వర్గాలు విడుదల చేశాయో లేదో అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో తాను నటించనని నటి శ్రుతిహాసన్ ఈ చిత్రం నుంచి తప్పుకుంది. దాంతో కథానాయిక కోసం ఈ సినిమా టీమ్ మళ్లీ అన్వేషణ మొదలుపెట్టింది.

ఇటు తెలుగు, అటు తమిళంతో పాటు హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను రూపొందించనున్నట్లు ఇప్పటికే ఈ చిత్రనిర్మాణ వర్గాలు తెలిపాయి. దీంతో తెలుగు, తమిళం, హిందీ భాషలలో సుపరిచితురాలైన స్టార్ హీరోయిన్  కోసం నిర్మాణ సంస్థ అన్వేషణ ప్రారంభించింది. ఇందులో భాగంగా బాహుబలి చిత్రంలో అదరగొట్టిన తమన్నాతో పాటు.. అనుష్కలను కూడా సంప్రదించాలని భావిస్తుందట నిర్మాన సంస్థ. వీరితో పాటు అటు ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనె లను కూడా జాబితాలో పెట్టుకుందని టాక్.

వీరిలో ఏ ఒక్కరు రెడీ అన్నా ఇక చిత్రం షూటింగ్ పట్టాలెక్కనుందని వార్తలందుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థకు ఓ నటి తెగ ఇబ్బంది పెట్టేస్తుందట. మహిళా వ్యాపారవేత్తరగా, నిర్మాతగా, నటిగా రాణిస్తున్న నీతూ చంద్ర.. శృతి హసన్ స్థానాన్ని తనకు ఇస్తే చాలా బాగా చేస్తానని హామిఇస్తుంది. అయితే తాను ఈ పాత్రలో ఒదిగిపోయేందుకు గల కారణాలను కూడా వివరిస్తుంది. నటిగా తనకు అనుభవం వుందని.. ఇక తనకు తైక్వాండో కూడా వచ్చునని.. మార్షల్ ఆర్ట్స్ లో వచ్చిన తనకు ఆ పాత్రకు న్యాయం చేస్తానని, ఇక తాను క్లాసికల్ డాన్సర్ అని కూడా చెబుతుందట.

ఇలా తన వివరాలన్నింటినీ తెలుపుతూ సంఘమిత్ర నిర్మాణ సంస్థకు వినతులను పంపుతూ ఈ పాత్రను దక్కించుకోవడానికి నీతూచంద్ర తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఏకంగా సోషల్ మీడియా వేదికగా నిర్మాణ సంస్థకు రిక్వెస్టులు పెడుతోందట. గతంలో శేఖర్ కమ్ముల 'గోదావరి' సినిమాలో సుమంత్ మరదలి పాత్రలో మెరిసిన నీతూ.. నిర్మాతగా కూడా రాణించింది. ప్రస్తుతం మిథిలా మక్కన్ చిత్రం కోసం ఏకంగా 11 కిలోల బరువు తగ్గించుకుని రెడీ అవుతుందట. అవకాశం వుందని తెలిసి తన వంతు ప్రయత్నం తాను చేయడానికి వెనుకాడటం లేదు. అయితే అమె ఎంత ప్రయత్నించినా ఈ సినిమాలో ఛాన్స్ దొరకడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles