Dangal becomes first Indian film to earn Rs 1,000cr in Chinaచైనాలో అమీర్ దంగల్ అరుదైన రికార్డు

Aamir khan s dangal becomes first indian film to earn rs 1 000cr in china

aamir khan, babita phogat, bollywood, box office, china, dangal, dhoom 3, facebook, furious 7, geeta phogat, monster hunt, olympics, phogat, rio olympics, social media

Dangal has joined the elite club of some 30 films that have raked in over Rs 1,000 crore. As per data on the ticketing platform Maoyan, the movie raked in 1.067 billion RMB

చైనాలో అమీర్ దంగల్ అరుదైన రికార్డు

Posted: 06/02/2017 05:58 PM IST
Aamir khan s dangal becomes first indian film to earn rs 1 000cr in china

ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూ విడుదలై ఐదు మాసాలు కావస్తున్న ఇంకా కలెక్షన్లతో దూసుకుపోతున్న భారతీయ చిత్రం అమీర్ ఖాన్ 'దంగల్'. సినీ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటూ విజయవిహారం చేస్తున్న ఈ చిత్రం తాజాగా చైనాలో అరుదైన రికార్డును అందుకుంది. ఇప్పటి వరకు చైనాలో విడుదలైన భారతీయ చిత్రాలలో ఇంతకు ముందు ఏ చిత్రమూ రాబట్టని కలెక్షన్లను ఈ చిత్రం రాబట్టుకుంది. చైనాలో వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిన తొలిచిత్రంగా దంగల్ రికార్డును నమోదు చేసుకుంది.

ఒక్క చైనాలోనే ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్ ను క్రాస్ చేసి కలెక్షన్లలో దూసుకుపోతుంది. నిన్నటి వసూళ్లతో కలుపుకుంటే ఈ సినిమా అక్కడ 1021 కోట్లను రాబట్టింది. ఇంతవరకూ హాలీవుడ్ సినిమాలు మాత్రమే ఈ స్థాయిలో అక్కడ వసూలు చేశాయి. హాలీవుడ్ కు చెందని చిత్రాలలో దంగల్ మాత్రమే చైనాలో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిందని సినీ విశ్లేషకుల అభిప్రాయం. చైనాలో ఈ స్థాయి వసూళ్లు ఇప్పట్లో మరో భారతీయ సినిమాకి సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమోషన్స్ తో కూడిన ఈ కంటెంట్ అక్కడి వారికి బాగా కనెక్ట్ కావడం వలన .. డ్రాగన్ బోట్ ఫెస్టివల్ సీజన్ కలిసి రావడం వలన ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయని చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamir khan  babita phogat  bollywood  box office  china  dangal  

Other Articles