New Record for Allu Arjun's Duvvada Jagannadham Trailer

Allu arjun dj trailer fastest 1 lakh clicks

Duvvada Jagannadham, Duvvada Jagannadham Trailer, DJ Movie Official Trailer, DJ Trailer Review, DJ Trailer, Allu Arjun DJ Tariler, DJ Trailer Review, DJ Trailer Likes DIslikes, Allu Arjun Brahmin Get Up, DJ Movie Story Leaked, DJ Story Line

Duvvada Jagannadham trailer Review. Formulaic Entertainer. Allu Arjun set to create another record. Fastest Clicks with in 1 hour.

డీజే ట్రైలర్.. అయినా సక్సెస్ అయ్యాడు

Posted: 06/06/2017 08:06 AM IST
Allu arjun dj trailer fastest 1 lakh clicks

సాధార‌ణంగా స్టార్ సినిమాల పై బజ్ కోసం ఫస్ట్ లుక్, టీజర్, ట్రైల‌ర్ల తేదీని కొన్ని రోజుల ముందుగానే చెప్పేస్తారు. అదంతా హైప్ కోసం స్టంట్ అని ప్ర్తత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, డీజే విషయంలో మాత్రం ఫలితం మరోలా ఉంది. ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని ఉదయం ప్రకటించినప్పటికీ.. సాయంత్రం గంటలో లక్ష క్లిక్కులను దాటేసి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే అదే సమయంలో ట్రైలర్ కు ఎప్పటిలాగే యాంటీ ఫ్యాన్స్ నుండి డిస్ లైక్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ ట్రైలర్ కు ఏకంగా పదివేల మందికి పైగా డిస్ లైక్ లు కొట్టారు. కొందరు అదేపనిగా చేసుకొని డిస్ లైక్స్ కొడుతుండడం మాత్రం కొసమెరుపు.

ఇక 'పబ్బుల్లో మ్యూజిక్ వాయించే డిజె కాదు.. పగిలిపోయేలా వాయించే డిజె' అని చెబుతూ.. 'జూన్ 23న' వస్తున్నాను అని కూడా చెప్పేశాడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. హరీశ్ శంకర్ డైరక్షన్లో రూపొందిన ''డిజె దువ్వాడ జగన్నాథమ్'' సినిమా ట్రైలర్ ఈరోజు లాంచ్ చేశారు. ఓ బ్రాహ్మణ క్యాటరింగ్ అబ్బాయి దువ్వాడ జగన్నాథమ్, ఒక మోడ్రన్ అమ్మాయితో ప్రేమలో పడటం. ఇంతలో ఎక్కడో ఓ అవినీతి విలన్. ఈ కాలంలో చెప్పాల్సింది 'బుద్దం శరణం గచ్చామి' కాదు ఈ కాలానికి కావాల్సింది 'యుద్దం శరణం గచ్చామి' అంటూ తన పని తాను చేసుకుపోతుంటాడు డిజె.

 

అయితే బ్రాహ్మణ్ గెటప్ లో బాగానే ఉన్నప్పటికీ ఆ పదాల ఉచ్చారణ కోసం బన్నీ కాస్త కష్టపడ్డాడనే చెప్పాలి. ఓవైపు స్టైలిష్ గెటప్ లో కూడా బన్నీ ఆకట్టుకున్నాడు. బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ అన్ని రిచ్ గానే ఉన్నాయి. దర్శకుడు హరీశ్ శంకర్ మాస్ కంటెంట్ తో సేఫ్ గేమ్ ఆడటమే కాదు.. పవర్ ఫుల్ డైలాగులనే సినిమా కోసం వాడేశాడు. మరోవైపు గుడిలో.. బడిలో.. ఒడిలో సాంగ్ లో ఓ వర్గంను కించపరిచినట్లు ఉన్న పదాలను తొలగించేందుకు చిత్ర యూనిట్ ఓకే చెప్పంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  DJ Movie  Trailer Review  

Other Articles