Bharat Anu Nenu Shooting with out Mahesh Babu

Mahesh commitment for bharat anu nenu

Bharat Anu Nenu, Bharat Anu Nenu Movie, Bharat Anu Nenu Bharat Anu Nenu Regular Shooting, Mahesh Babu, Koratala Siva Mahesh Babu, Bharat Anu Nenu Regular Shooting, Bharat Anu Nenu Heroine, Mahesh Babu 24 Movie, Spyder Bharat Ane Nenu, Mahesh Babu Commitment

Mahesh Babu Busy with Spyder. Koratala Siva shooting Bharat Anu Ninu without Mahesh Babu.

భరత్ అను నేను.. దటీజ్ మహేష్ కమిట్ మెంట్

Posted: 05/22/2017 03:45 PM IST
Mahesh commitment for bharat anu nenu

ఓవైపు స్పైడర్ అనుకున్న ప్రకారం షూటింగ్ జరగట్లేదు. క్వాలిటీ పేరిట మురగదాస్ చేస్తున్న హడావుడిపై మహేష్ కాస్త గరంగానే ఉన్నట్లు చెప్పుకున్నాం కూడా. జూన్ 23 తేదీ పోయి సెప్టెంబర్, అక్టోబర్ ఇలా రిలీజ్ డేట్ లో క్లారిటీ లేకుండా పోయింది. ఇది ఆటోమేటిక్ గా తర్వాతి సినిమాపై పడుతుందని మహేష్ ఫ్యాన్స్ కూడా కంగారు లో ఉన్నారు. అయితే వారిని ఊరడించే ఓ వార్త ఇప్పుడు బయటికి వచ్చింది.

స్పైడర్ సంగతి ఎలా ఉన్నా... 24వ చిత్రం భరత్ అను నేను మాత్రం సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోందంట. శ్రీమంతుడు డైరక్టర్ కొరటాల శివ ఇప్పటికే ఇందులోని కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులతో షెడ్యూల్ ను లాగించేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చిలోనే ముహుర్తం జరుపుకున్న ఈ సినిమా మే నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని ముందు నుంచే చెప్పుకున్నాం. అయితే స్పైడర్ లో ఇరుకుపోయిన మహేష్ ఇప్పట్లో ఎలాగూ ఫ్రీ అయ్యే ఛాన్స్ కనిపించటం లేదు. అందుకే కమిట్ మెంట్ కు కట్టుబడి సినిమా షూటింగ్ ను తాను లేకపోయిన కొనసాగించమని దర్శకుడు కొరటాలకు మహేష్ సూచించాడంట.

స్పైడర్ రెగ్యులర్ షూటింగ్ జూన్ మధ్య కల్లా పూర్తయ్యే ఛాన్సు ఉంది. ఆ తర్వాత మహేష్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇక హీరోయిన్ కైరా అద్వానీ అని చెప్పినప్పటికీ ఇంత వరకు ఆ బ్యూటీ కూడా షూటింగ్ లో పాల్గొనకపోతుండటంతో లాస్ట్ మినిట్ లో మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం. అన్ని కరెక్ట్ గా జరిగితే జనవరి 11, 2018న భరత్ అను నేను థియేటర్లను తాకే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Bharat Anu Nenu  Regular Shooting  Koratala Siva  

Other Articles