హిట్ల కోసం హీట్ లో మన హీరోల పాట్లు | Tollywood star heroes busy in summer shooting.

Tollywood star heroes working in hot weather

Tollywood Star Heroes, Tollywood Sultry Weather, Tollywood Summer Effect, 2017 Tollywood Upcoming Movies, Pawan Trivikram Movie Shooting, Tollywood Summer Shooting, Star Heroes Busy Summer

Tollywood star heroes beat sultry weather conditions and continue their shooting.

మన హీరోలకు ఎంత కష్టమొచ్చింది?

Posted: 04/11/2017 01:26 PM IST
Tollywood star heroes working in hot weather

దక్షిణ రాష్ట్రాల్లో ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్ పట్టణాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే వాటిని సాకుగా చేసుకుని వెకేషన్లు ఎంజాయ్ చేయాలన్న మూడ్ లో మన హీరోలు మాత్రం లేరనే చెప్పాలి.  40 ఢిగ్రీల పై బడ్డ హీట్ ను సైతం లెక్క చేయకుండా ఎలాగైనా హిట్లు అందించి తమ అభిమానులను అలరించాలనే తెగ కష్టపడిపోతున్నారు. సుమారు 10 నుంచి 12 గంటలపాటు షూటింగ్ లలో నిర్విరామంగా పాల్గొంటున్నారు.

సీనియర్ హీరోలైన బాలయ్య, నాగ్ లు ప్రస్తుతం వేసవిలో ఖాళీగా లేరు. బాలయ్య పూరీ, నాగ్ ఓంకార్ రాజుగారి గది-2 లో బిజీగా ఉన్నారు. చిరు, వెంకీలు మాత్రం రెస్ట్ తీసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ప్రస్తుతం హైదారాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. 12-14 గంటలపాటు పవన్ షూటింగ్ లో పాల్గొంటున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. అఫ్ కోర్స్ పవన్ కష్టానికి తగ్గట్లే రెమ్యునరేషన్ కూడా ఉండొచ్చనే అనుకోవాలి.

ఇక అబ్బాయి రాంచరణ్ రాజమండ్రి లో సుకుమార్ షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు. అక్కడ కూడా వేడి గాలులు భీభత్సంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆలస్యం అవ్వటం మూలంగానే రెస్ట్ లేకుండా సినిమా కంప్లీట్ చేయాలని చెర్రీ భావిస్తున్నాడు.

బ్రహ్మోత్సవంతో భారీ డిజాస్టర్ అందించిన మహేష్ బాబు మురగదాస్ సినిమా కోసం 24/7 కష్టపడుతున్నాడు. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం తర్వాత హైదారాబాద్ కి షిఫ్ట్ కానుంది. నాన్ స్టాప్ గా షెడ్యూల్ లో పాల్గొంటూ ఈ నెలాఖరుకల్లా సినిమా పూర్తి చేసే ఫ్లాన్ లో మహేష్ ఉన్నాడు.

ఇక ఎన్టీఆర్, అల్లు అర్జున్ లది ఇదే పరిస్థితి. హైదారాబాద్ మండుటెండల్లోనే ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాల షూటింగ్ ల కోసం కష్టపడుతున్నారు. దాదాపు అన్ని చిత్రాల అవుట్ డోర్ షూటింగ్ అయినప్పటికీ బ్రేక్ తీసుకునే ఆలోచనలో మాత్రం వీళ్లెవ్వరూ లేరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Star Heroes  Sultry Weather  Shooting  

Other Articles