మురుగదాస్ కామెంట్లకు కౌంటర్ వేసిన స్టార్ హీరోయిన్ | Star Heroine strong counter to Murugadoss.

Priyanka chopra counter attack to murugadoss award comments

Priyanka Chopra, AR Murugadoss, Murugadoss Priyanka Chopra, Priyanka Chopra Ventilator National Awards, Priyanka Chopra AR Murugadoss, Murugadoss Priyadarshan, Murugadoss 64th National Awards, National Awards 2017

Priyanka Chopra slams AR Murugadoss for National Award Controversial Comments. Don't divide Indian cinema she added.

మురుగదాస్ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్

Posted: 04/11/2017 03:09 PM IST
Priyanka chopra counter attack to murugadoss award comments

ప్రతీయేడూ జాతీయ అవార్డులు ప్రకటించటం, విమర్శకుల ప్రశంసలు పొంది కూడా అవార్డులు గెలుచుకోలేకపోయిన సినిమాల మేకర్లు బహిరంగంగానే విమర్శలు దిగటం, ప్యానెల్ ను దుమ్మెత్తి పోయటం ఈ తతంగం అంతా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ యేడాది 64వ అవార్డుల జాబితా విషయంలో జరిగిన విమర్శలు మాత్రం ఫోకస్ మరోలా మారిపోయేలా చేశాయి. దక్షిణాది చిత్రాలపై వివక్షత అన్న అర్థం వచ్చేలా మురగదాస్ చేసిన కామెంట్లు చిచ్చు రేపాయి. బాలీవుడ్ లో గజిని, హాలీడే చిత్రాలతో మురగదాస్ కు జాతీయ స్థాయిలో కూడా క్రేజ్ ఉంది. అలాంటప్పుడు ఇలా ఉత్తర, దక్షిణ సినిమాలంటూ వేరు చేయటం పెను దుమారమే రేపింది.

మరోవైపు హీరో అక్షయ్ కుమార్, ప్యానెల్ కమిటీ మెంబర్ అయిన దర్శకుడు ప్రియదర్శన్ కు దగ్గరి వ్యక్తి అని, అందుకే అవార్డును కట్టబెట్టాడని అర్థం వచ్చేలా మురగదాస్ కామెంట్ చేశాడు. అక్కీతో హాలీడే వంటి సూపర్ హిట్ తీసిన మురగదాస్ ఇలా మాట్లాడటం ఆశ్చర్యకరమే. అయితే ఆ స్టార్ డైరక్షన్ ఏ యాంగిల్ లో పై వ్యాఖ్యాలు చేశాడోగానీ, ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ ప్రియాంక చోప్రా కౌంటర్ వ్యాఖ్యలు వేసింది.

నేనేం నెగటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తిని కాదంటూ మురగదాస్ కు పరోక్షంగా చురకలు అంటిస్తూ దయచేసి ఉత్తర, దక్షిణ అంటూ సినీ రంగాన్ని వేరే చేయొద్దంటూ విజ్నప్తి చేసింది. ప్రాంతీయ చిత్రాలు జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన ఉదాహరణలను వివరిస్తూ ఇండియన్ సినిమా అనేది ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటుందని పేర్కొంది. తాను విదేశీ ప్రాజెక్టులు చేస్తున్న సమయంలో కూడా ఇండియన్ ఇండస్ట్రీ గురించి సగ్వరంగా మాట్లాడుకోవటం చూశానని, ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చే వారి విచక్షణకు వదిలేస్తున్నట్లు చెప్పింది. అన్నట్లు ప్రియాంక నిర్మాతగా నిర్మించిన మరాఠీ చిత్రం వెంటిలేటర్ కు మూడు జాతీయ అవార్డులు దక్కటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  AR Murugadoss  National Awards  Controversy  

Other Articles