ఆ చిత్రం గ్రాస్ కలెక్షన్స్ వింటే షాకే..! Man Down sold just one ticket at UK box office

Shia labeouf movie man down sold just one ticket at uk box office

Man Down, Shia LaBeouf, wartime thriller, Man Down UK Gross, Man Down UK first week collections, Man Down one ticket, Man Down in united kingdom, UK Gross, UK first week collections, hollywood, entertainment

Shia LaBeouf's wartime thriller Man Down, grossed a total of £7 ($8.70) on its opening weekend after just a single person purchased a ticket to see it.

ఆ చిత్రం గ్రాస్ కలెక్షన్స్ వింటే షాకే..!

Posted: 04/06/2017 03:58 PM IST
Shia labeouf movie man down sold just one ticket at uk box office

యుద్ద నేపథ్యంలో రూపోందిన చిత్రానికి ప్రేక్షకాదరణ ఎంతలా వుంటుందన్న విషయం గతంలో ఈ కథనే ఇతివృత్తంగా చేసుకుని తెరకెక్కిన చిత్రాలు సాధించిన విజయాలు స్పష్టం చేస్తుండగా, యుద్ద దేశభక్తి కి తోడు కన్నప్రమే, మమకారాలను జోడించిన చిత్రం మరింత ఆదరణను రాబట్టాలి. అయితే.. ఈ నేపథ్యంలో రూపోందిన చిత్రం మాన్ డౌన్ మాత్రం సనీ అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ పరమ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. అందుకు కారణం ఈ చిత్ర రాబట్టిన కలెక్షన్లే.

ఈ చిత్రానికి తొలివారం లో వచ్చిన గ్రాస్ కలెక్షన్టు పరిశీలించిన చిత్ర నిర్మాణ వర్గాలతో పాటు.. విశ్లేషకులు కూడా షాకయ్యారు. అమెరికా నటీనటులు షియా లాబోఫ్‌, కేట్‌ మారా నటించిన ఈ చిత్రం యూనైటెడ్ కింగ్ డమ్ లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చిత్రం విడుదలైన తొలివారంలో కేవలం ఏడు యూరోలను మాత్రమే వసూలు చేసింది. విడుద‌లై వారం రోజులు అవుతున్నా ఈ చిత్రాన్ని ఇప్పటివ‌ర‌కు ఒక్క ప్రేక్షకుడు మాత్రమే వీక్షించాడు.

యూకేలో కేవలం ఒక్క థియేటర్ లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఒకే షోను ప్రదర్శిస్తుంది. అయితే వారం రోజుల పాటు ఈ చిత్రం అడుతున్న ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే వీక్షించారు. దీంతో ఈ సినిమా అంత‌ర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. అమెరికాలో ముందుగానే విడుదల చేసిన ఈ చిత్రం అగ్రరాజ్యంలో మాత్రం బాగానే కలెక్షన్లను వసూలు చేసింది. అక్కడ మాత్రం ఈ సినిమాకు 4.54 లక్షల డాలర్ల కలెక్షన్లు వ‌చ్చాయి. యూకేలో ఇలా ఓ సినిమాకు ఒకే ఒక్క టికెట్ మాత్రమే అమ్ముడవడం ఇది రెండోసారి,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles