ఆటల నుంచి సోకులు.. అటుపై సినిమాలు? | PV Sindhu debut with her biopic.

Pv sindhu acting plan with biopic

PV Sindhu Movie, PV Sindhu Debut, PV Sindhu Tollywood, PV Sindhu Acting, PV Sindhu Biopic, PV Sindhu Life Movie, Deepaika Padukone PV Sindhu, PV Sindhu Cinema, PV Sindhu Role

Hyderabad Star Badminton champion PV Sindhu wants to play herself if a biopic is made on her.

సింధు బయోపిక్ లో పీవీ సింధు?

Posted: 04/04/2017 04:56 PM IST
Pv sindhu acting plan with biopic

హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కి ఇప్పుడు యూత్ లో మాములు క్రేజ్ లేదు. ఓవైపు ఆటతోనే కాదు, యాడ్ లు, పలు బ్రాండ్ లకు అంబాసిడర్ గా ఊపిరి సలపని షెడ్యూల్ లో బిజీ అయిపోయింది ఈ పొడగరి తెలుగమ్మాయి. అయితే ఇప్పటికే మోడలింగ్ లో దుమ్ము రేపుతున్న సింధు త్వరలో సినిమాల్లో కూడా నటించేందుకు సిద్ధమౌతుందా అన్న డౌట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం ఓ ఇంటర్వ్యూలో సింధు చేసిన కామెంట్లే.

ఒక వేళ మీ బయోపిక్ తీస్తే అందులో మీరోల్ ఎవరు చేస్తే బావుంటుందని మీడియా అడగ్గా, దానికి సింధు ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది. తన రోల్ లో తానే కనిపించాలనుకుంటున్నానని తేల్చి చెప్పింది. దీంతో సింధు సిల్వర్ స్క్రీన్ పైకి రావటం కన్ఫర్మ్ అయ్యిందనే డిస్కషన్ మొదలైంది. ‘నిజాయితీగా చెప్పాలంటే పీ వీ సింధు రోల్ లో నన్ను నేనే చూసుకోవాలనుకుంటున్నా’ అంటూ తెగేసి చెప్పింది కూడా.

తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించేసిన ఈ యువ క్రీడాకారిణి బయోపిక్ పై బాలీవుడ్ లో ఇప్పటికే ఓ అగ్ర దర్శకుడు గ్రౌండ్ వర్క్ చేయటం ప్రారంభించాడు కూడా. అయితే సింధు రోల్ లో సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకునే ను తీసుకున్నట్లు ముంబై మీడియా ఆ మధ్య కథనాలు కూడా రాసింది. అన్నట్లు దీపిక తండ్రి ప్రకాశ్ పదుకునే కూడా బ్యాడ్మింటన్ ఛాంపియన్ కావటం, ఆమెకు కూడా ఆ ఆటలో ప్రావీణ్యం ఉండటం ప్రయారిటీ ఇచ్చినట్లు చెప్పుకున్నారు. మరి సింధు తాజా వ్యాఖ్యలతో ఆ స్టార్ దర్శకుడు మనసు మార్చుకుంటాడంటారా? బయోపిక్ లో తళుక్కుమంటుందా? చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Sindhu  Movie Debut  Biopic  

Other Articles