టాలీవుడ్ పై కన్నేసిన కేఏ పాల్.. వర్మ, రాజమౌళి, పూరీపై ఫన్నీ ట్వీట్లు | Paul funny tweets on RGV Puri and Rajamouli.

K a paul tweets on tollywood top directors

K A Pual Tollywood, K A Pual Directors, Paul Rajamouli Puri and Varma, KA Paul RGV, Ram Gopal Varma Puri Jagannadh Rajamouli, Rajamouli Puri Varma, KA Paul Puri Jagannadh, KA Paul SS Rajamouli, KA Paul Funny Tweets, KA Paul Official Twitter, KA Paul Comments

K A Pual, the famous religious guru funny tweets on Tollywood top directors Ram Gopal Varma, SS Rajamouli and Puri Jagannadh.

టాలీవుడ్ టాప్ డైరక్టర్లపై పాల్ ట్వీట్లు

Posted: 04/05/2017 08:40 AM IST
K a paul tweets on tollywood top directors

మత పెద్దగానే కాదు, పలురకాల విచిత్రమైన కామెంట్లు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు కేఏ పాల్. అయితే వందల దేశాల ప్రధానులు, అధ్యక్షులు, సెలబ్రిటీలు తన ఆశీర్వాదం కోసం వచ్చిపోతుంటారని చెప్పే ఆయన, మొన్నామధ్య ట్రంప్ కూడా తనని ఆహ్వానించినప్పటికీ టైం లేకపోవటంతో వెళ్లలేదని ఇలా... ఆయన చెబుతున్నది కామెడీ యో, సీరియసో అర్థం కానీ పరిస్థితి నెలకొంటుంది. అయితే ట్విట్టర్ లో కూడా
ఈ మధ్య ఆయన నుంచి ఇలాంటి పోస్టులే పడుతున్నాయి.

మొన్నటిదాకా ఏపీ పొలిటిక్స్ ముఖ్యంగా నారా లోకేష్ ను టార్గెట్ చేసి ట్వీట్లు చేసిన ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలోని టాప్ డైరక్టర్లను కాంసంట్రేషన్ చేస్తూ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. "పూరీ జగన్.. ఇప్పుడే నీ రోగ్ మూవీ చూశా. ఇందులో స్టోరీ కూడా ఉంటే బాగుండేదని అనిపించింది. ఇక్కడ ఓ ఫిలిం స్కూల్ లో సీట్ బుక్ చేశాను. వెంటనే బ్యాగ్ ప్యాక్ చేసుకుని యూఎస్ వచ్చెయ్. వీసా పంపిస్తాను. ఇక్కడ బేసిక్స్ నేర్చుకోవచ్చు. గాడ్ బ్లెస్ యు" అంటూ పూరీకి కౌంటర్ వేశాడు. ఫన్నీ ట్వీట్ల కోసం

ఇక దర్శకధీరుడు రాజమౌళి గురించి రెస్పాండ్ అవుతూ... "ఎస్ ఎస్ రాజమౌళి.. నువ్వు లక్షల రూపాయలు ఖర్చు చేసి బాహుబలి2 ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ఉండొచ్చు. కానీ టీడీపీ తన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి కోట్లు ఖర్చు పెట్టి నీకు చెక్ పెట్టేసింది" అంటూ కామెంట్ ఈ ఖాతా ద్వారా పోస్ట్ అయింది.

 

ఆపై ఏకంగా వర్మను టార్గెట్ చేయగా.. "ఐక్యూ లెవెల్ విషయానికి వస్తే రాంగోపాల్ వర్మకు ప్రపంచంలో మూడో స్థానంలో ఉంటాడు. నా సంగతి వేరు. నేను ఐన్ స్టీన్ ను ఓడించేశాను" అంటూ ట్వీట్లు ఇంట్రెస్టింగ్ గా మారయి. అయితే ఇది అఫీషియల్ ట్విట్టరో కాదో మాత్రం క్లారిటీ లేకుండా పోయిందిగానీ పవనిజం లాగా పౌలిజం అంటూ తెగ వైరల్ అవుతున్నాయి. అదంతా సరేగానీ ఇంతకీ లోకేష్ ప్రమాణ స్వీకారానికి పాల్ గారు ఎందుకు అటెండ్ కాలేదంటారు?. అఫ్ కోర్స్ దానికి కూడా సమాధానం ఉంది చూస్కోండి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KA Paul  Tollywood Directors  Rajamouli  Puri Jagannadh  Ram Gopal Varma  

Other Articles