సినిమా పాజిటివ్ బజ్ కోసం ఏం చేస్తున్నాడో తెలుసా? | After Ghazi Guru did it in Tollywood.

Preview shows for venkatesh guru movie

Venkatesh Guru Movie, Guru Movie Celebrity Previews, Guru Movie Previews, Guru movie Positive Buzz, Venkatesh Guru Movie Review, Guru Movie Special Shows, Guru Movie 2017, Guru Movie Talk

Venkatesh Guru team planing for create buzz on movi. Draw the attention of people with celebrities review. Venkatesh is already on a promotional spree, and now the unit has started conducting preview shows to celebrities.

గురు కోసం సెలబ్రిటీ ప్రివ్యూ షోలు

Posted: 03/28/2017 03:55 PM IST
Preview shows for venkatesh guru movie

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఓ ప్రత్యేక శైలి. మిగతా హీరోల్లా కాకుండా డిఫరెంట్ పంథాలో దూసుకుపోవటం ఆయన స్టైల్. అదే సమయంలో దశాబ్దాల తర్వాత మల్టీ స్టారర్ చిత్రాలకు బీజం వేసేందుకు చాలా చొరవ తీసుకున్నాడు. అలాంటి వెంకీకి రీమేక్ సినిమాలతో హిట్లు కొట్టడం కొత్తేం కాదు. అయితే వాటితో హిట్ల కన్నా ఫ్లాప్ పర్సంటేజీనే వెంకీ ఖాతాలో ఎక్కువగా ఉంది. అదే సమయంలో దృశ్యం లాంటి
ఫ్యామిలీ సబ్జెక్ట్ సినిమాతో ఆకట్టుకున్నాడు కూడా.

అయితే మిగతా హీరోలు, చివరకి వారసులు కూడా రేసులో దూసుకుపోతున్న క్రమంలో ఎలాగైనా ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టడం వెంకీకి చాలా అవసరం. కానీ, మళ్లీ ఓ రీమేక్ తోనే వస్తుండటంతో వాటిపై కాస్త అనుమానాలు నెలకొన్నాయి. నిజానికి ఈ సినిమా అల్రెడీ తమిళ్, హిందీలో కమర్షియల్ హిట్ గా కాకపోయినా క్రిటిక్స్ నుంచి ప్రశంసలు మాత్రం అందుకుంది. అలాంటి సబ్జెక్ట్ తో రావటం అంటే మాములు విషయం
కాదు. కానీ, వెంకీ ఆ విషయంలో వెనుకంజ వేయలేదు. పైగా ఎప్పటి నుంచో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ ఉన్న సినిమా తీయాలని ఆలోచనలో ఉన్నాడు. అన్నీ కలిసి రావటంతో సాలా ఖడ్డూస్ రీమేక్ కు పచ్చ జెండా ఊపేశాడు.

వెంకీ కష్టం... 

బాక్సింగ్ కోచ్ గా కనిపించాలంటే చిన్న విషయం కాదు కదా. అందుకే నెలల తరబడి జిమ్ లకు అంకితం అయిపోయాడు. ట్రైనర్ ఆధర్వ్యంలో శిక్షణ తీసుకున్నాడు. కాస్త వయసు పైబడటంతో వారించిన కష్టపడి ఫిట్ గా తయారయ్యాడు. బ్లాక్ అండ్ వైట్ గడ్డంతో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లోకి మారిపోయాడు. ఎంత త్వరగా షూటింగ్ మొదలుపెట్టాడో, అంతే త్వరగా ఫినిష్ చేశాడు. అయితే అదే సమయంలో టఫ్ కాంపీటీషన్
ఉండటంతో వెనక్కి తగ్గాడు.

నిజానికి ఈ సినిమాను మూడు నెలలు పోస్ట్ పోన్ చేసేసరికి హైప్ మొత్తంగా పడిపోయింది. హడావుడిగా సినిమాను ప్రీపోన్ చేస్తున్నట్లు ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. మళ్లీ ఇప్పడు సరిగ్గా రిలీజ్ కు ముందు సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి కొత్త ఫ్లాన్ ను అమలు చేయబోతున్నారు. అదే సెలబ్రిటీలకు స్పెషల్ ప్రివ్యూ వేసి చూపించటం.

నిజానికి ఇదేం కొత్త విషయం కాదు. బాలీవుడ్ లో పెద్ద, చిన్న స్టార్లు తేడా లేకుండా ప్రతీ సినిమాను ఇలానే ప్రదర్శిస్తారు. వారి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాబట్టి, ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేసి, ఆపై సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారు. తెలుగులో కూడా ఘాజీ ఈ మధ్య ఇదే ఫార్ములా ఫాలో అయ్యింది. అందుకే వెంకీ కూడా రిలీజ్ రెండు రోజుల ముందే దీనిని ప్రివ్యూలు వేసేందుకు రెడీ అయిపోతున్నాడు. ఆ రకంగా సినిమాకు హైప్ క్రియేట్ చేసి హిట్ కొట్టాలన్నది దగ్గుబాటి హీరో మాస్టర్ ఫ్లాన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  Guru Movie  Special Previews  

Other Articles