బూతు రీమేక్ లో ఆ సీన్ల సంగతి ఏంటి? | Explicit Scenes in Babu Baga Busy.

No explicit scenes in adult remake

Babu Baga Busy, Babu Baga Busy Director, Babu Baga Busy Explicit Scenes, Avasarala Srinivas Explicit Scene, Babu Baga Busy Adult Content, Hunterr Telugu Remake, Babu Baga Busy Actress, Babu Baga Busy Hero, Babu Baga Busy Director

Babu Baga Busy director Naveen says Explicit Scenes Toned Down in this Adult Comedy.

అడల్ట్ కామెడీలో ఆ సీన్లు లేవంట!

Posted: 03/28/2017 03:22 PM IST
No explicit scenes in adult remake

బాలీవుడ్ లో అడల్ట్ సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయ్యింది హంటర్. ముగ్గురు అమ్మాయిలతో ఓ వ్యక్తి సాగించే రొమాంటిక్ డ్రామానే ఈ చిత్ర కాన్సెప్ట్. ఆ సినిమాను తెలుగులో బాబు బాగా బిజీ పేరుతో తీసేశారు కూడా. నటుడిగానే కాదు, దర్శకుడిగా కూడా తానేంటో ఫ్రూవ్ చేసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ తో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు అవసరాల శ్రీనివాస్. అతన్ని హీరోగా పెట్టి నవీన్ మేడారం అనే కొత్త వ్యక్తి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు.

అయితే హిందీలో ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ మరీ టూమచ్ గా ఉంటుంది. ఇన్నర్ డ్రెస్సుల మీద ఫోజులు, బెడ్ సీన్లు, లిప్ లాక్ లు ఇలా అంతా రచ్చ రచ్చగా ఉంటుంది. మరి తెలుగు వర్షన్ ట్రైలర్ లో అల్రెడీ కాస్త ఇంటిమేట్ సీన్లతోనే నింపేశాడు దర్శకుడు. మరి మాతృక లోని మసాలా సీన్లను యాజ్ ఇట్ ఈజ్ గా దించేశాడా? అలా అయితే మన ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది కాస్త అనుమానంగా మారింది.

బాలీవుడ్ లో అలాంటి వాటికి ఓకేగానీ, మన దగ్గర కాస్త ప్రేక్షకులు సెన్సిటివ్ గా ఉంటారు. అందుకే ఆ సీన్లు లేకుండా మార్చి తీశాడని చెబుతున్నాడు నవీన్. ఇది సెక్స్ అడిక్షన్ తో బాధపడే ఓ వ్యక్తి కథ. మెయిన్ థీమ్ వరకు అలాగే ఉంచి, మిగతాది మాత్రం చాలా వరకు మార్పులు చేశానని చెబుతున్నాడు. తేజస్వి మదివాడ, సుప్రియ, మిస్తీ చక్రవర్తి మరియు శ్రీముఖి ప్రధాన పాత్రలో పోషిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ రెండో వారంలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Avasarala Srinivas  Babu Baga Busy  Explicit Scenes  

Other Articles