అర్థరాత్రి ఆ సూపర్ స్టార్ ఏం చేశాడో చూడండి | Malayalam Superstar hul chul on roads in Mid Night.

Mohanlal roaming on cycle in thiruvananthapuram

Mohanlal, Mohanlal Cycle Ride, Mohanlal Mid Night,Mohanlal Unnikrishnan Movie, Mohanlal Thiruvananthapuram Roads, Mohanlal Pedal Ride, Mohanlal Villain Movie

Malayalam Senior Hero Mohan Lal Cycle ride on Thiruvananthapuram

అర్ధరాత్రి సైకిల్ పై మోహన్ లాల్ హల్ చల్

Posted: 03/22/2017 03:09 PM IST
Mohanlal roaming on cycle in thiruvananthapuram

మనమంతా, జనతా గ్యారేజీల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన మోహన్ లాల్ మళయాళంలో టాప్ హీరో అన్న విషయం తెలిసిందే. అయితే మల్లూవుడ్ లో ఇప్పటిదాకా మరెయితర హీరోలకు సాధ్యం కానీ వంద కోట్ల ఫీట్ ను 55 ఏళ్ల వయసులో పులిమురుగన్(మన్యం వీరుడు) తో సాధించాడాయన. త్వరలో ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో విలన్ సినిమాతోపాటు 1971 భారత సరిహద్దు సినిమాల ద్వారా పలకరించేందుకు రెడీ అయిపోతున్నాడు.

స్వతహాగా రైటర్ అయిన మోహన్ లాల్ సోషల్ యాక్టివిటీస్ లో కూడా ఎప్పుడూ ముందుంటాడు. అదే సమయంలో నిరాడంబరమైన జీవితం గడిపేందుకు ఇష్టపడుతుంటాడు కూడా. అయితే స్టార్ డమ్ ఆ విషయంలో ఆయనకు ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతుంది కూడా. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ చుట్టుముట్టుతుండటం లాంటి ఇబ్బందులు ఆయనకు వస్తుంటాయి. అందుకే తెలివిగా ఓ ఫ్లాన్ వేసి దానిని అమలు చేస్తున్నాడు.

ఇదిగో ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నారే అది ఆయనే. తిరువనంతపురంలోని రోడ్ల మీద మోహన్ లాల్ ఇలా తిరుగుతుంటే ఓ యువకుడు తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పెట్టేశాడు. అర్ధరాత్రి సమయంలో అయితే జనాలు ఉండరని భావించిన ఆయన అనంతపురి వీధుల్లో ఇలా సైకిల్ తో చక్కర్లు కొట్టేస్తున్నాడు. చిన్నప్పుడు ఏ వీధుల్లో అయితే స్నేహితులతో చక్కర్లు కొట్టానో ఇప్పుడు అదే రోడ్ల మీద తిరుగుతుండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. గతంలో పీకూ సందర్భంగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ఇలానే కోల్ కతా వీధుల్లో సైకిల్ తొక్కి సరదా తీర్చుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malayalam  Mohal  

Other Articles