టాలీవుడ్ లో ఈమెను ఎవరూ లైంగికంగా వేధించలేదంట! | Actress gives clean U certificate to Tollywood.

Richa gangopadhyay comments on tollywood

Richa Gangopadhyay, Richa Gangopadhyay Tollywood, Richa Gangopadhyay Latest Interview, Richa Gangopadhyay Sexual Harassment, Richa Gangopadhyay Quit Movies, Richa Gangopadhyay Telugu Movies

Heroine Richa Gangopadhyay says she was not facing any sexual harassment in Tollywood.

టాలీవుడ్ కు సపోర్ట్ గా రిచా కామెంట్లు

Posted: 03/15/2017 10:07 AM IST
Richa gangopadhyay comments on tollywood

భావన కిడ్నాప్ వ్యవహారంతో మొదలైన సెలబ్రిటీల ఆపై ఇండస్ట్రీలోని లైంగిక వేధింపుల వైపు మళ్లీ పెను దుమారమే లేపింది. ఇది చాలదన్నట్లు కోలీవుడ్ లో సుచిత్ర వ్యవహారం సినీ ఫీల్డ్ అంటేనే ఒక రకమైన ఫీలింగ్ కలిగేలా చేసింది. అది అంతటితో ఆగకుండా క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక ఆరోపణలు దాకా వెళ్లటంతో పరిస్థితులు మరింత వేడెక్కాయి. నగ్మా, కస్తూరి లాంటి సీనియర్లు కూడా ఆ వ్యాఖ్యలను సపోర్ట్ చేయటంతో లోతుగా చర్చ మొదలైంది.

అయితే టాలీవుడ్ మాత్రం ఆ విషయంలో బంగారం అంటోంది నటి రిచా గంగోపాధ్యాయ. మిరపకాయ్, మిర్చి, సారొచ్చారు చిత్రాలతో అలరించి, చాన్నాళ్ల క్రితమే సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈ బ్యూటీ తెలుగు పరిశ్రమకు సపోర్ట్ గా మాట్లాడుతోంది. ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ. "టాలీవుడ్ పరిశ్రమ చాలా ప్రొఫెషనల్ అని చెబుతూ ఇలాంటి ప్రతిపాదనలు తనకైతే ఎప్పుడూ రాలేదని చెప్పింది.

సౌత్ లో రెండు భాష్లలోనూ పలు సినిమాలు చేశానన్న ఆమె.. ఏ హీరోగానీ, మేకర్లు గానీ తనతో అసభ్యంగా ప్రవర్తించిన దాఖలాలు లేనే లేవని అంటోంది. "మహిళలపై వేధింపులు ప్రతీ చోట ఉంటాయి. మనం ధృడంగా ఉంటే.. అసంబద్ధంగా అడ్వాన్స్ అయేందుకు ఎవరూ ప్రయత్నించరు" అంటూ గట్టిగా రిటార్ట్ కూడా ఇచ్చేసింది 30 ఏళ్ల రిచా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Richa Gangopadhyay  Sexual Harassment  Tollywood  

Other Articles