సహజ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ముంబై లోని ఓ అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం పెద్ద షాకే ఇచ్చింది. పంజాబీ నిర్మాతగా పలు చిత్రాలను తీసిన ఆయన త్వరలో ఓ తెలుగు సినిమాకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే కారణాలేవో తెలీకుండా ఇలా విగతజీవిగా మారటం పలు అనుమానాలకు తావిచ్చింది.
అయితే ఆయన మరణం వెనుక ఆర్థిక వ్యవహారాలు ఎంత మాత్రం కారణం కాదని మోహన్ బాబు లాంటి వాళ్లు చెబుతుండగా, ఆయన గత కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కోకిలాబెన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడని తెలుస్తోంది. గతంలో కూడా ఆయన ఇలాగే ఓసారి సూసైడ్ కి యత్నించాడని తెలుస్తోంది. చాన్నాళ్ల క్రితం ఆయన తీసిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావటంతో ఆత్మహత్య యత్నం చేశాడు కూడా.
ఆపై జయసుధ ఎలాగోలా ఆ నష్టాన్ని భర్తీ చేసినప్పటికీ, ఆయనింకా అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకంటూ కుంగిపోయే వాడని, ఈ క్రమంలోనే ముంబైలోని అంధేరీ వెస్ట్ జేపీ రోడ్లో ఉన్న సీ గ్లింప్స్ భవన సముదాయంలోని సోదరి ఇంట్లో ఉంటున్న నితిన్ కపూర్ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. గతంలో ఓసారి కారు ప్రమాదం నుంచి కూడా ఆయన భయపడ్డాడు కూడా.
క్రికెట్ కలిపింది ఇద్దరినీ...
జయసుధ అసలు పేరు సుజాత. అప్పటికే ఓ సుజాత ఉండటంతో క్లాసిక్ దర్శకుడు ఆమె పేరును జయసుధగా మార్చేశాడు. నాదెండ్ల భాస్కర్ రావు బంధువైన రాజేంద్ర ప్రసాద్ ను పెళ్లి చేసుకుని ఆపై విడాకులు కూడా తీసుకుంది ఆమె. తర్వాత 1985 లో నితిన్ కపూర్ తో మళ్లీ వివాహం అయ్యింది. పంజాబీ నిర్మాత అయిన నితిన్ బాలీవుడ్ లెజెండరీ హీరో జితేంద్రకు దగ్గరి బంధువు. దాసరి జితేంద్ర తో సినిమా తీయటం, నితిన్ తరచూ ఆ షూటింగ్ లకు వస్తుండేవాడు. ఈ క్రమంలో వీరిద్దరి పరిచయం ఏర్పడటం. ఇద్దరికి క్రికెట్ పేవరట్ కావటం, అభిరుచులు కలవటంతో ప్రేమ చివరికి పెళ్లి అలా చకచకా జరిగిపోయాయి.
వీరిద్దరికీ నిహార్, శ్రేయన్ అనే ఇద్దరు కుమారులు. గతంలో నితిన్ కు ఆర్థిక కష్టాలు వచ్చిన సమయంలో జయసుధ ఎంతో అండగా ఉండేది. అయినా మనోధైర్యం చాలక ఇలా నితిన్ ఆత్మహత్యకు పాల్పడటం దిగ్భ్రాంతికి గురి చేసింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more