ఫెమినా మిస్ ఇండియా, అటు నుంచి బాలీవుడ్ నటిగా ప్రమోట్ అయ్యింది నమ్రతా శిరోద్కర్. మహేష్ తో చేసింది ఒక్క సినిమానే అయినా పీకల లోతు ప్రేమలో ముంచేసింది. ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ పెద్దల అంగీకారంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. మరాఠీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ చిన్న విభేదాలు కూడా లేకుండా 12 ఏళ్ల వైవాహిక జీవితం పూర్తి చేయటమే కాదు, ఓ స్టార్ హీరో సక్సెస్ వెనకాల ఆమె కృషి కూడా ఉందని చాలా సందర్భాల్లో నిరూపించుకుంది.
పెళ్లి తర్వాత పలువురు హీరోయిన్లు రీఎంట్రీల కోసం ఎగబడిపోతుంటే ఇంత బ్యాగ్రౌండ్ ఉండి కూడా నమ్రత మాత్రం సైలెంట్ గా తన పూర్తి సమయం కుటుంబానికే కేటాయిస్తుంది. మరి అలాంటి సూపర్ స్టార్ వైఫ్ మహేష్ కున్న ఓ బ్యాడ్ హాబిట్ గురించి చెప్పేస్తోంది. పిల్లలను అతిగారాబం చేయటంలో మహేష్ కి తనకి తరచూ మాటల యుద్ధం జరుగుతుందని చెబుతోంది. సినిమాలతో మహేష్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ... కొంచెం తీరిక దొరికినా పిల్లలు గౌతమ్, సితారలతో గడుపుతాడని నమ్రత తెలిపింది. పిల్లలను అతి గారాబం చేస్తాడని... వాళ్లు ఏది అడిగినా కొనిపెట్టేది మహేషే అని చెప్పింది. ఈ విషయంలో కొన్నిసార్లు మహేష్ కి తనకు గొడవ జరుగుతుందని, తనే పిల్లను పాడు చేస్తున్నావంటూ దెప్పిపొడుస్తుంటానని తెలిపింది. తల్లిదండ్రుల్లో ఒకరు గారాబం చేస్తే, మరొకరు క్రమశిక్షణను పిల్లలకు అలవాటు చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇక మహేష్ ఓ మంచి తండ్రే కాదని, ఓ మంచి కొడుకు కూడా అని చెప్పిన నమ్రతా తన కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల కోసం మహేష్ ఏమైనా చేస్తాడని కితాబిచ్చింది. ఖలేజా సమయంలో తన పేరెంట్స్ చనిపోతే షూటింగ్ కాన్సిల్ చేసుకుని కొన్ని రోజులపాటు తనకు అండగా ఉన్నాడని తెలిపింది. మహేష్ ఓ మంచి నటుడే కాదు, అంతకు మించి ఓ మంచి మనస్సున్న వ్యక్తి అని చెబుతూ అతనితో పరిచయం కావటమే తన జీవితంలో జరిగిన ఓ గొప్ప సంఘటన అంటూ హ్యాపీనెస్ వ్యక్తం చేసింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more