లైంగిక వేధింపులు.. మాట మార్చిన భావన.. ఇన్ స్టాలో మెసేజ్ | Brave Bhavana is back to shooting.

Bhavana posted a picture of hers with a message

Actress Bhavana, Bhavana Molestation, Bhavana on Molestation, Actress Molestation in Car, Kerala Molestation, Bhavana Case, Bhavana Instagram, Bhavana Emotional Message, Bhavana Back, Bhavana New Movie Shooting, Bhavana Quit Movies

Actress Bhavana Emotional Message in her Instagram. Bhavana was molested by a gang in a moving car. The entire film industry stood by her. Her fans supported her and assured her that they will join her in this fight.

లైంగిక వేధింపుల గురించి భావన రెస్పాన్స్

Posted: 03/01/2017 12:35 PM IST
Bhavana posted a picture of hers with a message

నటి భావన ఉదంతం ఒక్క మాలీవుడ్ లోనే కాదు, యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే కదిలించి  పెను చర్చకు దారితీసింది. షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆమెను కిడ్నాప్ చేసి మరీ లైంగిక వేధింపులకు గురిచేయటం సంచలనంగా మారింది. మాములు మహిళలకే కాదు, ఓ స్టార్ హీరోయిన్ కే భద్రత లేదని ఈ ఘటన రుజువు చేసిందని పలువురు అభిప్రాయపడ్డారు. కొందరు సెలబ్రిటీలైతే తాము కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కున్నామని ధైర్యంగా స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు.

అయితే కేసులో నిందితులకు శిక్ష పడేదాకా తాను తిరిగి సినిమాల్లో నటించబోనని ప్రతిజ్న చేసిన భావన ఇప్పుడు మనుసు మార్చుకుంది. పృథ్వీరాజ్ తో నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్ లో పాల్గొని యూనిట్ సభ్యులతోసహా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తనపై జరిగిన దాడి ప్రభావం షూటింగ్ పై పడకుండా మాములుగా నవ్వుతూ నవ్విస్తూ ఎప్పటిలాగే ఆమె షూటింగ్ లో పాల్గొందంట. అయితే లోపల మాత్రం తాను ఎమోషనల్ గా ఫీలవుతున్నానో తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేసింది.

Bhavana Instagram Message

జీవితంలో నాకు కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. ఏ పరిణామాలైతే చూడకూడదని అనుకున్నానో.. ఆ పరిస్థితులే నాకు ఎదురయ్యాయి కూడా. అవి నాకు పెను బాధను కలిగించి ఉండొచ్చు. కానీ, వాటి నుంచి నేను కొలుకుని తీరతానంటూ తెలిపింది. నాపై ప్రేమాభిమానాలు చూపి అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ అంటూ ఆ సందేశంలో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Bhavana  Molestation  Mollywood  

Other Articles

Today on Telugu Wishesh