చెర్రీ మూవీకి అలా జాన్తా నై... సుక్కూ కి ఫస్ట్ వార్నింగ్... కాంప్రమైజ్ అయి మారతాడా? | Sukumar compromise for Ram Charan Movie.

Will sukumar makes perfect plan for ram charan movie

Sukumar Ram Charan Movie, Mythri Movie Makers Hat trick Plan, Mythri Movie Makers Sukumar, Sukumar Delay Movies, Sukumar Next Movie, Sukku Cherry movie, Sukumar Screenplay, Mythri Movie Makers Warn Sukumar

Will Sukumar Change Himself for Ram Charan movie. Prodution banner Mythri Movie Makers have asked Sukumar to give a perfect plan on the shooting days and total costing. It's also learnt that the film's shoot begins only after locking the script tightly.

చెర్రీ సినిమా... సుకుమార్ కి వార్నింగ్ పడింది

Posted: 02/10/2017 11:32 AM IST
Will sukumar makes perfect plan for ram charan movie

బిఫోర్ సినీ కెరీర్ లెక్కల మాష్టార్ గా ఎలాంటి కంప్లైంట్ లు లేని సుకుమార్ సినిమాల విషయానికొస్తే ఆ లెక్క ఎప్పటికప్పుడు తప్పుతూనే ఉంటాడు. దానికి కారణం సినిమా సెట్స్ లో ఉండగానే కథను డెవలప్ చేసుకోవటం లాంటి చెడ్డ అలవాటు ఉండటమే. అంతేకాదు కొన్ని కొన్ని సందర్భాల్లో సీన్లను కూడా ఆశువుగా రాస్తుండటంతో ఎక్స్ ట్రా సీన్లు కూడా సినిమాకు యాడ్ చేయాల్సి వచ్చేది. దీంతో అసలే కాంప్లికేటెడ్ సినిమాలు తీస్తాడన్న ట్యాగ్ లైన్ కు తోడు లేట్ కూడా అవుతుందన్న కంప్లైంట్ లు వినిపించసాగాయి.

సుకుమార్ గత రెండు చిత్రాలు నాన్నకు ప్రేమతో, వన్ నేనొక్కడినే లను గమనిస్తే ఇదే విషయం అర్థమౌతుంది. టోటల్ అవుట్ పుట్ కంప్లీట్ అయ్యాక అనవసరపు సీన్లను తొలగించినప్పటికీ, ఈ రెండు చిత్రాల నిడివి చాలా ఎక్కువే ఉంది. దీనిని బట్టి సుకుమార్ పనితనం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే తన నెక్ట్స్ సినిమా విషయంలో అలాంటి తప్పు రీపిట్ జాగ్రత్త పడుతున్నారంట చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. చెర్రీ చేసిన సాహసం ఇదే

అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేసి సక్సెస్ అందుకుంటారనే బ్రాండ్ మైత్రి మూవీ మేకర్స్ పై ఉంది. పైగా రెండు వరుస ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లు ఇచ్చి హ్యాట్రిక్ కోసం రెడీగా ఉన్నారు. అందుకే చెర్రీ సినిమా విషయంలో ఇలాంటి జాప్యాలు జరగకుండా, ముందు పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలని సుక్కూకి సూచించారంట. మరి సుకుమార్ ఈ విషయంలో కాంప్రమైజ్ అవుతాడా? లేదా? అన్నది వేచి చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Sukumar  Ram Charan Movie  Mythri Movie Makers  

Other Articles