జై లవకుశ మొదలుపెట్టేశాడు.. రిలీజ్ తేదీ అప్పుడేనా? | NTR Bobby Movie Launched.

Ntr jai lavakusa movie launched

NTR 27th Movie, NTR 27, NTR Bobby Movie Launch, NTR Jai lavakusa launch, Jai lavakusa Release Date, Jai Lavakusa Launch Photos, NTR Bobby Muhurtham Shot

NTR's 27th Movie Jai Lavakusa officially Launched. Bobby Directed and Raashi Khanna Nideda Thamas in Lead roles.

ఎన్టీఆర్ జై లవకుశ లాంఛ్ అయ్యింది

Posted: 02/10/2017 01:50 PM IST
Ntr jai lavakusa movie launched

జనతా గ్యారేజ్ తర్వాత కొత్త సినిమా విషయంలో చాలా సమయమే తీసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. హోప్స్ పెట్టుకున్న వక్కంతం వంశీని, కథతో రెడీ గా ఉన్న పూరీని కాదని, మరికొందరు యువ డైరక్టర్ల కథలు విన్నాడు. ఎట్టకేలకు పవర్ ఫేమ్ బాబీ డైరక్షన్ లో కథకు ఓకే చేశాడు.

ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ 27వ మూవీ లాంఛనంగా ఈరోజు షూటింగ్ ప్రారంభమైంది. దేవుళ్ల చిత్రపటాలతోపాటు, సీనియర్ ఎన్టీఆర్ పై స్వయంగా జూనియర్ క్లాప్ ఇవ్వటం విశేషం. మాస్ దర్శకుడు వీవీ వినాయక్ ముఖ్యఅతిథిగా హాజరై కెమెరా స్విచ్ఛ్ ఆన్ చేశాడు. నందమూరి హరికృష్ణ, రామకృష్ణలు కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.

బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, తారక్ సరసన రాశీఖన్నా, నివేధా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరూ ఫస్ట్ టైం ఓ స్టార్ హీరోతో నటించబోతుండటం విశేషం. పిబ్రవరి 15 నుంచి సినిమా రెగ్యులర్ సూటింగ్ ప్రారంభం కానుంది. ఆగష్టు 11న విడుదల చేసేందుకు కళ్యాణ్ రామ్ ప్లాన్ వేసుకున్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  27th Movie  Jai Lavakusa  Launch  

Other Articles