నేచురల్ స్టార్ ఇక నుంచి స్టార్ హీరోనే... | Nani proves stamina with Nenu Local Collections.

Nani nenu local five days collections

Nani Nenu Local, Nenu Local Collections, Nenu Local 5 Days Collections, Nenu Local Natural Star, Nani Stardom, Nenu Local Overseas Collections, Nenu Local Total Collections, Natural Star Nani

Nani Nenu Local Five Days Collections touched 20 crores mark. Continues its steady run at worldwide box office.

ఐదు రోజుల్లో నేను లోకల్ కలెక్షన్లు

Posted: 02/08/2017 03:35 PM IST
Nani nenu local five days collections

సక్సెస్ ఫుల్ హీరో అన్న ట్యాగ్ లైన్ కోసం స్టార్ కిడ్స్ పరితపిస్తున్న ఈరోజుల్లో వరుసగా ఆరు హిట్లు(మజ్ను యావరేజ్ ) కొట్టి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు నేచురల్ స్టార్ నాని. నేను లోకల్ కి వచ్చిన ఓపెనింగ్స్ నాని స్టామినా ఏంటో చూపిస్తున్నాయి. నాని నిజంగా ఇప్పుడు ఓ స్టార్ హీరో అని ఒప్పుకుని తీరాల్సిందే ఇప్పుడు. యావరేజ్ కంటెంట్ ను ఈ స్థాయి సక్సెస్ అయిందంటే అందులో నాని క్రెడిట్ సగం కంటే ఎక్కువే ఉందని చెప్పుకోవాలి.

‘నేను లోకల్’ ఆల్రెడీ ఫస్ట్ వీకెండ్లోనే రూ.15 కోట్ల షేర్ రాబట్టిన నేను లోకల్ ఐదు రోజుల విషయానికొచ్చేసరికి 20 కోట్ల కలెక్షన్లతో దుమ్ముదులిపి పడేసింది. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ, జస్ట్ రెండు రోజుల కలెక్షన్లతోనే డిస్ట్రిబ్యూటర్ లు సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లడమంటే మాములు విషయం కాదు. కానీ, నాని ఆ ఫీట్ చేసి చూపించాడు. టైటిల్ కు తగ్గట్లే తెలుగు రాష్ట్రాల్లోనే నాని రాబట్టిన కలెక్షన్లు 15 కోట్లు. మరోవైపు భలే భలే మగాడివోయ్ తర్వాత సెకండ్ మిలియన్ మార్క్ అందుకునేందుకు చిత్రంగా నేను లోకల్ ఇంచు దూరంలో ఉంది.

మొత్తానికి సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా డిస్ట్రిబ్యూటర్లకు ఏ మాత్రం డ్యామేజ్ చేయని హీరోగా, తనకంటూ ఓ మినిమయ్ మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నాడు నాని. మినిమం 15 కోట్లు.. పాజిటివ్ టాక్ వస్తే 20 కోట్లు... హిట్టయితే రూ.25 కోట్లు గ్యారెంటీ అన్న భరోసా వచ్చేసింది. నేనులోకల్ సింగం-3, నమో వేంకటేశాయ వచ్చినప్పటికీ కూడా ఫుల్ రన్లో రూ.25-30 కోట్ల మధ్య షేర్ వచ్చే అవకాశాలు స్పష్టంగా  కనిపిస్తున్నాయి.

 

ఐదు రోజులకు ఏరియా వైజ్ కలెక్షన్లు:

Nizam - 603 lacs
Ceded - 195 lacs
Nellore - 42 lacs
Guntur - 116.2 lacs
Krishna - 114.22 lacs
West - 87.10 lacs
East - 141 lacs
Uttharandhra - 203 lacs
US USD - 780K.

మొత్తం సుమారు 19.6 కోట్లతో జస్ట్ ఐదు రోజుల్లో బాబుగాడు రచ్చ చేసి పడేశాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Nenu Local  Collections  

Other Articles