సూర్య చేసిన పనితో అంజలి అఫైర్ కన్ఫర్మ్ అయ్యింది | Suriya Dosa Challenge Reveal Jai and Anjali's Releation.

Jai anjali confirm their relationship

Jai-Anjali, Avtor Jai Love, Actress Anjali Love, Anjali Affair, Jai Anjali Relation Confirm, Jai Dosa Challenge, Jai and Anjali, Journey Couple Affair, Anjali Jai, Jai Affair, Anjali Affair, Jai Anjali Relation, Jai Anjali Marriage, Dosa Challenge

As a part of Magalir Mattum promotions, Suriya urged his followers to take up the 'Dosa Challenge'.It must be noted that Jai and Anjali have been rumoured to be dating each other for quite sometime. With the recent picture, the couple is a hit online.

అంజలి-జై అఫైర్.. కన్ఫర్మ్ అయిపోయింది

Posted: 02/08/2017 04:52 PM IST
Jai anjali confirm their relationship

ప్రముఖ సౌత్ హీరోయిన్ అంజలి ఓ తమిళ హీరోతో కొంత కాలంగా ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నవ విషయం తెలిసిందే. 'జర్నీ' సినిమాలో జైతో కలిసి జోడి కట్టిన అంజలి అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ గా మారిపోవటం, తరచూ బయట కలిసి కనిపిస్తుండటంతో వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ కోలీవుడ్ కోడై కూస్తోంది.

అయితే తామిద్దరం మంచి స్నేహితులమని అంజలి చెప్పగా, జై మాత్రం తమ బంధం గట్టిదేనని ఇండైరక్ట్ గా హింట్ ఇస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో సూర్య చేసిన పనితో వారిద్దరి మధ్య అఫైర్ వెలుగులోకి వచ్చింది. 'మగళిర్ ముట్టుమ్' సినిమా టీజర్ ఈ మధ్య విడుదలైన విషయం తెలిసిందే. సూర్య భార్య జో (జ్యోతిక) ఇందులో ఓ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే 'ఇంట్లో అందరి కోసం లెక్కకు మించి దోసెలు వేసే అమ్మ, శ్రీమతి కోసం ఎవరైనా ఒక్క దోసె వేశారా?' అంటూ పలువురు టీజర్ చూసి నిలదీశారు. దీంతో వంటగదిలో దూరిన సూర్య తన భార్య జ్యోతిక కోసం దోసె వేసి దాని ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ...పలువుర్ని ట్యాగ్ చేసి ‘దోసె ఛాలెంజ్‌’ విసిరాడు.

దర్శకుడు వెంకట్ ప్రభు, దేవీశ్రీ, హ్యారిస్ జైరాజ్ తదితరులు ఉన్నారు. ఇక వంటిట్లో దూరి దోసెలు వేసిన వెంకట్ ప్రభు, తర్వాత ఆ ఛాలెంజ్ ను హీరో జై కి విసిరాడు. జై ఏకంగా అంజలితో కలిసి దోసెలు వేస్తూ ఆ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఈ ఛాలెంజ్ లో సూర్య పెట్టిన కండిషన్ ఏంటంటే... అమ్మ లేదా శ్రీమతి కోసం వంటవాళ్లుగా మారాలని. అంజలి, జైకి తల్లి కాదు కనుక ఏం అవుతుందో ఇక మీకే వదిలేస్తున్నాం. ప్రస్తుతం తమిళ అభిమానులను ఈ ఫోటో బాగా ఆకట్టుకుంటోంది. నిజానికి వీరిద్దరికి పెళ్లయినట్లు ఒకానోక టైంలో వార్తలు రావటం కూడా విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hero Jai  Anjali  Affair  Dosa Challenge  

Other Articles