కొడుకు పేరు మీనింగ్ వేరేలా చెప్పిన సైఫ్ | Saif Ali Khan breaks his silence on Taimur's name.

Saif ali khan on son taimur name controversy

Saif Ali Khan, Kareena Kapoor, Saif Kareena Son, Saif Ali Khan son name, Saif Ali Khan Taimur, Taimur's name meaning, Taimur controversy, Timur, Taimur, not Timur its taimur

Saif Ali Khan on Taimur controversy says he should have added a disclaimer.

కొడుకు పేరుపై పెదవి విప్పాడు

Posted: 01/17/2017 05:25 PM IST
Saif ali khan on son taimur name controversy

బాలీవుడ్‌ లో సెలబ్రిటీ పసికందు రాజేసిన వివాదం అంతా ఇంతా కాదు. సైఫ్-కరీనా దంపతులకు పుట్టిన కొడుకు బయటి ప్రపంచంకు కనిపించకుండానే పాపులర్ అయ్యాడు. తమ గారాలపట్టికి తైమూర్‌ అలీఖాన్‌ పటౌడీ అనే పేరు పెట్టడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీలో విధ్వంసం సృష్టించిన టర్కీ రాజు తైమూర్‌ పేరును ఎందుకు పెట్టారంటూ పలువురు మండిపడ్డారు. అయితే రిషి కపూర్ మాత్రం ఈ విషయంలో వాళ్లకి సపోర్ట్ ఇచ్చాడు. వాళ్ల ఇష్టం ఉన్న పేరు పెట్టుకుంటే మీకొచ్చే నష్టం ఏంటని ఆయన వ్యాఖ్యానించాడు.

ఇక ఈ విషయంపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న సైఫ్‌ ఎట్టకేలకు స్పందించాడు. ఆ పేరులో ఎలాంటి పొరపాటు లేదని, చరిత్ర గురించి నాకు అవగాహన ఉందని తెలిపాడు. దేశంపై దాడి చేసింది టర్కీ రాజు తైమూర్‌ (Timur). నా కొడుకు పేరు తాయ్‌మూర్‌ (Taimur). ఇది పర్సియన్‌ పేరు. దీని అర్థం ఉక్కు. ఈ పేరన్నా, దీని అర్థమన్నా నాకు, నా భార్య కరీనాకు ఇష్టం’ అని సైఫ్‌ చెప్పాడు.

సోషల్‌ మీడియాలో వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. వారికి నచ్చినట్టుగా కామెంట్లు చేస్తారని, అయితే కొందరు ద్వేషిస్తూ పోస్టులు చేయడం తప్పని అన్నాడు. ఈ విషయంలో చాలామంది తనకు మద్దతుగా నిలిచారని చెప్పాడు. కాబట్టి అనవసరమైన డిస్కషన్లు మాని, ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిందంటూ సూచించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saif Ali Khan  Taimur  controversy  

Other Articles

Today on Telugu Wishesh