టైటిల్ సడన్ గా మళ్లీ మారింది.. ఎందుకిలా చేస్తున్నాడు? | A sudden change in Suriya's next.

Suriya movie title changes from s3 to c3

Suriya, Singam 3, S3 to C3, Suriya Singam 3, tax exemption for Suriya movie, Singam 3 title change, C3 movie, Suriya title change

Suriya's 'S3' Undergoes Name Change, becomes 'C3'.

టాక్స్ కోసమే టైటిల్ మార్చాడంట!

Posted: 01/17/2017 05:16 PM IST
Suriya movie title changes from s3 to c3

సూర్య సింగం ఫ్రాంచైజ్ మూడో పార్ట్ విడుదలకు సిద్ధమైపోతుంది. అయితే మరోసారి టైటిల్ సమస్య మరోసారి ఇబ్బంది పెట్టడంతో నిర్మాతలు మరో నిర్ణయం తీసుకున్నారు. కొన్ని నెలలకు ముందే ఈ సినిమా పేరును సింగం-3 నుంచి 'ఎస్ 3' గా మార్చిన విషయం తెలిసిందే. అయితే వినోదపు పన్నులో రాయితీని పొందడం కోసం ఈ సినిమా టైటిల్ ను ఇప్పుడు మరోసారి ఛేంజ్ చేసేశారు.

'సి 3' గా ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్, దర్శకుడు హరి కూడా స్పష్టం చేశారు. మాటి మాటికీ ఇలా టైటిల్ ఛేంజ్ కావటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (క్లీన్ యూ కోసం గొడవ చేశాడా?)

 

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ లో యాక్టివ్ గా పాల్గొనేందుకు సూర్య సిద్ధమైపోతున్నాడు. కోయం బత్తూరులోని 'కోవై'లోను .. 'కేరళ' లోను ఈ సినిమా బృదం సందడి చేయనుందనీ, అభిమానులను సూర్య కలుసుకోనున్నాడని నిర్మాతలు చెప్పారు. అనుష్క .. శ్రుతిహాసన్ కథానాయికలుగా నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు, తమిళ్ లో సి-3 విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Suriya  Singam series  C3  title change  

Other Articles