రాంచరణ్ కామెడీ ప్రమోషన్ చూస్కోండి | Ram Charan comedy interview with Viva Harsha.

Ram charan inteaction with media for dhruva promotion

Ram Charan Dhruva Interview, Ram Charan Dhruva Promotion, Chai With Charan, Ram Charan Viva Harsha, Viva Harsha Ram Charan, Cherry with Viva Harsha, Dhruva Ram Charan preview, Ram Charan Funny Interview, Ram Charan Promotion

Ram Charan change promotion strategy for Dhruva Movie. fun interaction with Mega Power Star Ram Charan along Viva Harsha.

ధృవ కోసం చెర్రీలో ఎంత మార్పు?

Posted: 12/08/2016 12:55 PM IST
Ram charan inteaction with media for dhruva promotion

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ధృవకి ఇంకా కొద్దిగంటలే ఉన్నాయి. ఈ లోపు సాధ్యమైనంత సమయం వరుసగా ఇంటర్వ్యూలతో గడిపేస్తున్నాడు. ఈ క్రమంలో తొమ్మిదేళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఉన్న చెర్రీకి, ఇప్పుడున్న చెర్రీకి చాలా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే ఇంతకు ముందు సినిమాల కన్నా కాస్త భిన్నంగా ఈసారి ప్రమోషన్ లలో పాల్గొంటున్నాడు.

సినిమాకు సంబంధించి ఓ కీలక డైలాగుతో వీడియోను రిలీజ్ చేయటం, అది ప్రామిసింగ్ గా ఉండటంతో చిత్రం బ్లాక్ బస్టర్ కావటం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఇక ప్రమోషన్ లో భాగంగా అనసూయతో డేటింగ్, పలు న్యూస్ ఛానెళ్లకిచ్చిన ఇంటర్వ్యూల్లో చాలా మెచ్యూర్డుగా సమాధానాలిచ్చాడు చెర్రీ. ఇక చివర్లో వైవా ఫేమ్ హర్షతో చేసిన ఓ ఇంటర్వ్యూ అయితే నవ్వులు పూయించిందంతే... మాములుగా బయట ఎప్పుడు సీరియస్ గా కనిపించే చెర్రీ, ఇందులో మాత్రం చాలా ఫన్నీ డైలాగులతో అలరించాడు. అదే టైంలో పంచ్ డైలాగ్ లతో కూడా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హర్షపై వేసిన కౌంటర్ టైమింగ్ మాత్రం సూపర్బ్.

 

ఇక ప్రీమియర్ షోల కోసం యూఎస్ వెళ్లిన చెర్రీ అక్కడ మూడు నగరాల్లో ఫ్యాన్స్ తో ధృవ ప్రివ్యూను చూడనున్నాడు. ఓవైపు మెగా అభిమానుల్లో ధృవపై టెన్షన్ నెలకొంటే.. చెర్రీ మాత్రం కంటెంట్ చాలా బాగా ఉందని.. కాబట్టి రిజల్ట్ గురించి పెద్దగా వర్రీ కావల్సిన పనిలేదని ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ధృవ పవర్ ఫుల్ డైలాగ్ కోసం క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mega Powerstar ram Charan  Viva Harsha Dhruva Interview  

Other Articles