తెలుగు సినిమాలు ఎందుకు చేయటం లేదంటే... | Why makers afraid for Samantha.

Samantha upset with marriage announcement

Samantha, Samantha telugu movies 2017, Samantha upset with marriage announcement, Samantha no movies, Samantha telugu chances, Samantha on Tollywood makers, Samatha her marriage announcement, Samantha Nagarjuna announcement, Samantha Naga Chaitanya Marriage, Samantha Ruth Prabhu 2016, Samantha not signed, Samantha Tollywood, Samantha good bye tollywood

Samantha Upset with Tollywood Makers. The day her marriage plans were announced, the offers dried up.

టాలీవుడ్ మేకర్లపై షాకింగ్ కామెంట్లు

Posted: 12/08/2016 12:27 PM IST
Samantha upset with marriage announcement

సౌత్ బేబీ డాల్ సమంత... కెరీర్ స్టార్ట్ చేసింది కోలీవుడ్ తోనే. కానీ, ఆమెను స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది మాత్రం టాలీవుడే.. వరుస హిట్లతో గోల్డెన్ లెగ్ గా మారిపోయిన శామ్ ఖాతాలో ఈ యేడాది 24, అ..ఆ...,  జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్లు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం కోలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తున్న సామ్, తెలుగు వైపు ఎందుకు చూడటం లేదు. కథలు లేవా? పారితోషకం విషయంలో తేడానా? లేక ఇతర కారణం ఏదైనా ఉందా?

ఇప్పటికే ఈ విషయంలో చాలా సార్లు క్లారిటీ ఇచ్చిన సమంత, పెళ్లి అనౌన్స్ మెంట్ తర్వాత టాలీవుడ్ మేకర్లు తనవైపు చూడటమే మానేశారంటోంది. ఆరు నెలల క్రితం కూడా కొన్ని బడా ప్రాజెక్టులు తన దగ్గరికి వచ్చాయంట. అయితే అప్పటికే చైతూ ప్రేమ వ్యవహారం వార్తల్లో నానటం, ఆపై పెళ్లి వచ్చే యేడాది అన్నది దాదాపుగా కన్ఫర్మ్ కావటం, నాగ్ కూడా ఓపెన్ అయిపోవటంతో వారంతా ఒక్కోక్కరుగా వెనక్కి వెళ్లిపోయారంట.

పెళ్లి తర్వాత సినిమాలు చేస్తానని, నేను, అభ్యంతరం లేదని అక్కినేని ఫ్యామిలీ ఓపెన్ గా ప్రకటనలు ఇచ్చాయ్. అయినా కూడా జంకుతున్న నిర్మాతలు సమంతను అప్రోచ్ అవటానికి వెనకంజ వేస్తున్నారు. అందుకే ప్రస్తుతం కోలీవుడ్ లో మాత్రమే తాను సినిమాలు చేయాల్సి వస్తుందని చెబుతోంది. ఇప్పటికే తాను తెలుగులో రెడీ అని ట్విట్టర్ లో చెప్పాను, అయినా పెళ్లయితే సినిమాలు చేయకూడదా? అంటూ ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైరాగ్యం వ్యక్తం చేసింది సామ్.

ప్రస్తుతం విశాల్, శివకార్తీకేయన్ సినిమాల్లో చేస్తున్న సమంత, రాంచరణ్-సుకుమార్ మూవీలో నటిస్తుందని చెప్పినప్పటికీ, ఆ తర్వాత అదంతా ఉత్తదేనని తెలీపోయింది. చూద్దాం ఇంత ఓపెన్ గా మాట్లాడాక అయినా ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా?   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Telugu Movies  Announcing marriage  killed all offers  

Other Articles