పవన్ డైలాగ్ తో కుమ్మేసిన యాంకర్ శ్రీముఖి | Hot anchor does Pawan's spoof.

Srimukhi spoof with pawan dialogue

Srimukhi Spoof, Anchor Srimukhi, Anchor Srimukhi Facebook, Anchor Srimukhi Pawan kalyan, Anchor Srimukhi Pawan, Srimukhi as gabbar Singh, Srimukhi imitates Pawan, Srimukhi Pawan kalyan

Anchor Srimukhi Spoof with Pawan Dialogue and upload that video in her Facebook.

పవన్ ను ఇమిటేట్ చేస్తూ హాట్ యాంకర్ వీడియో

Posted: 12/08/2016 11:24 AM IST
Srimukhi spoof with pawan dialogue

ప్రస్తుతం టాలీవుడ్ లో పవర్ స్టార్ ఇమేజ్ ను ఉపయోగించుకోని వారు వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. తమ సినిమాల్లో ఏదో ఒక సందర్భాల్లో పవన్ ను వాడేసుకుంటున్నారు ఇప్పుడు దర్శకులు. రీసెంట్ గా వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా, జయమ్ము నిశ్చయమ్మురాలో కూడా పవన్ క్రేజ్ ను వాడేసుకోవటం, వాటికి విజిల్స్ పడిపోవటం కూడా జరిగిపోయాయి. ఇక ఎప్పటి నుంచో పవన్ వీరాభిమానిని అని చెప్పుకునే యాంకర్ శ్రీముఖి మరోసారి తన అభిమానాన్ని చాటుకుంది.

ఆ మధ్య పవర్ స్టార్ చేతి బ్యాండ్ ను ధరించి ఆ ఫోటోను పెట్టిన ఈ హాట్ యాంకర్ ఇప్పుడు ఏకంగా పవన్ పేరిట ఓ స్ఫూఫ్ వీడియోను అప్ లోడ్ చేసింది. ముఖానికి పవర్ స్టార్ మాస్క్ ధరించి గబ్బర్ సింగ్ లోని డైలాగ్ ను చెప్పేసింది. నా కొంచెం తిక్కుంది.. కానీ, దానికో లెక్కుంది అని మెడ మీద చెయ్యేసి రుద్దుతూ చెబుతూ.. చివర్లో హా.. హా... అంటూ ఎక్స్ ప్రెషన్ కూడా ఇచ్చేసింది.

బుల్లి తెరపై తన ప్రభంజనం చాటుతున్న శ్రీముఖి ఇప్పటికే పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. హీరోయిన్ కి కావాల్సిన లక్షణాలు పుష్కలంగా ఉన్న ఈ అచ్చ తెలుగు యాంకర్ కి అవకాశం వస్తే(ఇస్తే) చాలు చెలరేగిపోతానని హింట్ కూడా ఇచ్చేస్తోంది. అందుకే అడపా దడపా ఇలా సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు, ఇలా వీడియోలు అప్ లోడ్ చేస్తూ యాక్టివ్ గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్వతహాగా పవన్ ఫ్యాన్ కావటంతో ఇలా ఓ వీడియో అప్ లోడ్ చేసి తన అభిమానం చాటుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Srimukhi  Pawan Kalyan Spoof  Gabbar Singh Dialogue  

Other Articles