కాటమరాయుడులో తారకరత్న పక్కా ఫేక్ న్యూస్ | Fake news circulating about Pawan's Katamarayudu

Tarakaratna siva balaji old pic viral

Siva Balaji and Tarak Ratna, Katamarayudu fake pic, Tarak Ratna Katamarayudu, tarak not in katamarayudu, Katamarayudu, Pawan kalyan katamarayudu, Katamarayudu news

A photo of Siva Balaji and Tarak Ratna are doing hulchul in social media.but that was not belongs to Katamarayudu.

ఆ ఫోటోకి కాటమరాయుడికి సంబంధం లేదు

Posted: 11/30/2016 03:51 PM IST
Tarakaratna siva balaji old pic viral

ఓవైపు కాటమరాయుడి షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంటే.. మరో పక్క సినిమా హాట్ కేక్ కావటంతో ఫేక్ వార్తల ప్రభంజనం కూడా అదే స్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఆ మధ్య ఏదో చిన్న గొడవ జరిగితే టోటల్ గా షూటింగే ఆపేశారంటూ పుకార్లు రేపారు. ఇక ఇప్పుడు తాజాగా నెట్ లో ఓ ఫోటోను పెట్టేసి ఏవేవో వార్తలు రాసేస్తున్నారు.

విషయం ఏంటంటే... కాటమరాయుడి లో తారకరత్న అన్న పేరుతో ఉదయం నుంచి ఓ న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమాలో పవన్ కి తమ్ముళ్లుగా శివబాలాజీతోపాటు కమల్ కామ రాజు, అజయ్ నటిస్తున్నారు. ఆ ఫోటోలో శివబాలాజీ పక్కన తారకరత్న కూర్చున్న ఫోటో ఉంది. దీంతో కాటమరాయుడి సెట్ లో అన్న ట్యాగ్ లైన్ న్యూస్ హల్ చల్ అయ్యింది. అయితే ఆ ఫోటో వెనుక అసలు విషయం ఇప్పుడు బయటపడింది.

కొన్ని నెలల క్రితం వనభోజనాల సందర్భంగా  బెస్ట్ ఫ్రెండ్స్ అయిన శివబాలాజీ, తారకరత్నలు ఇలా ఒకే చోట చేరి పాల్గొన్నారు. అది చాలా కాలం క్రితమే శివబాలాజీ తన ఫేస్ బుక్ లో పెట్టాడు కూడా. అది కన్ఫర్మ్ చేసుకోకుండా కాటమరాయుడులో తారక్ ఉన్నాడా? అంటూ ఎంక్వెయిరీలు చేసే రేంజ్ లో కథనాలతో హడావుడి చేస్తున్నారు కొందరు. ఆ విషయం పక్కనబెడితే ఉగాదికి సందడి చేసేందుకు కాటమరాయుడి నిర్విరామంగా షెడ్యూల్ లో పాల్గొంటూనే ఉన్నాడు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : katamarayudu  Fake photo  tarakaratna  

Other Articles