బోయపాటిని సైడ్ చేసిన మాటల మాంత్రికుడు | Trivikram's 2 Hour meet with Megastar

151 or 152 for trivikram

Megastar chiranjeevi, Trivikram Srinivas, Chiru Trivikram, 151 or 152 for Trivikram, after pawan its chiru

Megastar chiranjeevi team up with Trivikram Srinivas.

ఆ రెండు గంటలు చిరు ఏం చేశాడంటే...

Posted: 11/30/2016 03:44 PM IST
151 or 152 for trivikram

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా చివరి దశకు చేరుకోకముందే తన తర్వాతి చిత్రంపై కూడా క్లారిటీకి వచ్చేశాడన్న వార్త ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతోంది. సరైనోడు ప్రీ రిలీజ్ మీట్ సందర్భంగా బోయపాటిని ఆకాశానికి ఎత్తేసిన చిరు, సింహ సినిమా తన దగ్గరికే ముందు వచ్చిందని, అది మిస్సయినప్పటికీ బోయపాటితో ఓ సినిమా మాత్రం తప్పక తీస్తానని చెప్పాడు. దీంతో 151వ సినిమా అతని చేతిలోనే పెట్టబోతున్నాడంటూ చెప్పుకున్నాం.

కానీ, బోయపాటి మళ్లీ బాలయ్య కోసమే పని చేయబోతున్నాడంటూ వార్తలు రావటంతో ఆ ప్రాజెక్ట్ డౌట్ ఫుల్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే మరో క్రేజీ దర్శకుడితో చిరు 151 అన్న సమాచారం అందుతోంది. మాటల మాంత్రికుడు మెగాస్టార్ కాంబోలోనే ఈ సినిమా ఉండొచ్చన్న హింట్ ఇప్పటికే ఇచ్చేశారు కూడా. రీసెంట్ గా మెగాస్టార్ మాటల మాటల మాంత్రికుడు సుదీర్ఘంగా డిస్కషన్స్ చేయడంతో ఈ క్రేజీ కాంబో తెర మీదకు వచ్చింది. గతంలో జై చిరంజీవా చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించిన విషయం తెలిసిందే. సినిమా కమర్షియల్ గా ఆడకపోయినా, అందులోని పంచ్ లు, కామెడీ టైమింగ్ మాత్రం బాగా పేలాయి.

రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో.. చిరు-త్రివిక్రమ్ మూవీ ఖాయమైందని అంటున్నారు. కాకపోతే.. త్రివిక్రమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనుండడంతో.. ఆ తర్వాత చిరంజీవితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన బోయపాటి సినిమాపై క్లారిటీ లేనప్పటికీ,  151, 152 ఈ రెండిటింలో ఏదో ఒకటి మాత్రం ఈ మ్యాజిక్ కాంబో లోనే కావటం పక్కాగా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar Chiranjeevi  Trivikram Srinivas  new movie  

Other Articles