ముగ్గురు దర్శకులు.. సేమ్ స్టోరీతో సినిమాలు? | 3 Telugu Directors Copied 1 English Film?

Blind scripts hulshul in tollywood

Telugu directors, Blind scripts in Tollywood, Bobby Anil Ravipudi and Veligonda Sreenivas, tollywood three directors, Blind Story Tollywood, Blind Detective in Tollywood, Oppam Hollywood, Hollywood movie inspiration for Three tollywood movies

Bobby, Anil Ravipudi and Veligonda Sreenivas these three's next with same story.

ఒకే కథను ముగ్గురు బ్లైండ్ గా చెప్పేశారా?

Posted: 11/30/2016 05:11 PM IST
Blind scripts hulshul in tollywood

ఒకే కథనంతో సినిమాలు ఒకేసారి రిలీజ్ కావటం అన్నది కాకతాళీయంగా ఆ మధ్య ఓసారి జరిగింది. నాగ్ గ్రీకు వీరుడు, యువ హీరో ఆది రాకుమారుడు చిత్రాలు దాదాపు సేమ్ కంటెంట్ తో తెరకెక్కటం ఆశ్చర్యపరిచింది. అనూహ్యంగా ఆ రెండు అట్టర్ ఫ్లాపులు కావటంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం ఓ ముగ్గురు యంగ్ డైరక్టర్లు ఒకే స్టోరీ ఇన్సిపిరేషన్ తో కథలు తయారు చేసుకుని స్టార్ హీరోలను అప్రోచ్ కావటమే డిస్కషన్ కి తెరలేపింది.

పవర్ ఫేం బాబీ, పటాస్ దర్శకుడు అనిల్ రావిపూడి, అప్ కమింగ్ దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్  ఈ ముగ్గురు అంధ నేపథ్యంతో ఉన్న కథలను పట్టుకుని తిరుగుతుండటమే ఇందుకు కారణం. ఈ ముగ్గురికి ప్రేరణ ఇచ్చిన ఆ సినిమా 2013లో వచ్చిన హాంకాంగ్ బ్లాక్ బస్టర్ మూవీ బ్లైండ్ డిటెక్టివ్. అవును.. ఈ ఒక్క సినిమాను ఆధారంగా చేసుకునే ఈ ముగ్గురు దర్శకులు సినిమాలు తీయబోతున్నారని సమాచారం.


వీరిలో ఇప్పటికే వెలిగొండ శ్రీనివాస్ రాజ్ తరుణ్ తో అందగాడు అనే సినిమా ప్రారంభించగా, అనిల్ రావిపూడికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఇచ్చి వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేశాడు. ఇక మరో దర్శకుడు బాబీ కనిపించినవారికల్లా వినిపిస్తున్న కథ ఇలాంటిదేనని సమాచారం. చివరకు బన్నీ ఆ కథను ఓకే చేసి మిగిలిన రెండు చిత్రాలు విడుదలై వాటి ఫలితం చూశాకే ఓకే చేద్దామని చెప్పాడంట.

ఇదిలా ఉంటే మోహన్ లాల్ రీసెంట్ గా ఒప్పమ్ అనే సినిమాతో మళయాళంలో హిట్ కొట్టాడు. ఆ సినిమా కూడా బ్లైండ్ డిటెక్టివ్ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కటం విశేషం. మాములుగా పరభాష సినిమాలను మనోళ్లు కాపీ కొట్టడం చూశాం గానీ, ఇలా ఒకేసారి ముగ్గురు దర్శకులు ఒకే సినిమాతో కథలు అల్లుకోవటం మాత్రం స్పెషల్ అనే చెప్పుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Bobby  Anil Ravipudi  Veligonda Sreenivas  blind story  

Other Articles