అల్లు అర్జున్ కి కూతురు పుట్టింది | Allu Arjun Blessed with Baby Girl.

Bunny blessed with baby girl

Allu Arjun, Sneha Reddy, Allu Arjun Snehe Reddy, Allu Arjun Baby, Bunny Daughter, Allu Arjun Daughter, Allu Arjun Kids, Bunny Kids, Bunny Baby, Master Ayaan

Stylish Star Allu Arjun blessed with Baby Girl and posted in Social Media.

అల్లు అర్జున్ కి అమ్మాయి పుట్టింది

Posted: 11/22/2016 07:53 AM IST
Bunny blessed with baby girl

అల్లు వారింట లక్ష్మీ కళ నెలకొంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి దంపతులకు సోమవారం సాయంకాలం కుమార్తె జన్మించింది. ఈ విషయాన్ని స్వయంగా బన్నీ తన వ్యక్తిగత ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ఖాతాల్లో పోస్ట్ చేశాడు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయితో తనకు ఎంతో ఆనందంగా ఉందని, తాను అదృష్టవంతుడినని బన్నీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. తమను అభినందించినవారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

కాగా, బన్నీ-స్నేహరెడ్డిలకు 2011 మార్చిలో వివాహం జరగ్గా, 2014లో బాబు పుట్టాడు. తొలి సంతానంకి అయాన్ అని పేరు పెట్టిన అల్లు అర్జున్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలతో సందడి చేసేవాడు. కాగా, ఆ మధ్య తాను మరోసారి తండ్రిని కాబోతున్నానంటూ ఓ ఫోటో అప్ లోడ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు బన్నీ. గర్భవతిగా ఉన్న స్నేహను అయాన్ ముద్దు పెట్టుకున్న ఆ ఫోటో బాగా వైరల్ అయ్యింది.

మూడు నెలల నుంచి ఈ క్షణాల కోసమే డీజే షూటింగ్ కు హాజరుకాకుండా ఉన్న బన్నీ తన కొత్త లుక్ ను కూడా ఎక్కాడా రివీల్ చేయటం లేదు. మరి తన ముద్దుల కూతురితో ఇప్పుడైనా బన్నీ బయటపడతాడా చూద్దాం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun Couple  Baby Girl  

Other Articles