ధ్రువ సీక్రెట్ గా ఎందుకు సెన్సార్ జరిగింది.. అయినా కొత్త రికార్డు | Dhruva censor completed silently.

Dhruva censor completed

Ram Charan, Dhruva Movie, Dhruva Release Date, Dhruva Censor, Dhruva secret Censor, silent Censor for Dhruva, Ram Charan Dhruva, Dhruva December 9th

Ram Charan Dhruva Movie censor completed got U by A.

చెర్రీ ధ్రువ సెలైంట్ గా సెన్సార్ పూర్తి

Posted: 11/22/2016 08:58 AM IST
Dhruva censor completed

మెగాపవర్ స్టార్ రాంచరణ్ ధ్రువ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యూ బై ఏ సర్టిఫికెట్ తో డిసెంబర్ 9న గ్రాండ్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైపోయింది. రాంచరణ్ కే కాదు.. టోటల్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది పెద్ద షాకే అనుకోవాలి.

కారణం.. రిలీజ్ కు మూడు వారాల ముందుగానే ఒక సినిమా సెన్సార్ పూర్తి చేసుకోవటం, అది కూడా ఓ భారీ బడ్జెట్ కావటం ఇదే ఫస్ట్ టైం. చివరి నిమిషంలో మార్పులు, చేర్పులు చేసుకుని కనీసం ఒక వారం ముందుగా సెన్సార్ బోర్డు వద్దకు వెళ్లి, ఆపై రిలీజ్ అయిన చిత్రాలు ఈ మధ్య మనం తరచూ చూస్తున్నాం. అవేం కాకుండా ఇంత ముందుగా చెర్రీ సెన్సార్ పూర్తి చేసుకున్నాడంటే ఎంత పక్కాగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.

ఇక సెన్సార్ టాక్ ప్రకారం ఒరిజినల్ వర్షన్ ను కాస్త మార్చి ఫస్టాఫ్ లో కామెడీ డోస్ పెంచగా, సెకండాఫ్ లో కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేసినట్లు తెలుస్తోంది. అల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన చిత్రం రీమేక్ గా వస్తున్న ఈ ధ్రువ చెర్రీ భారీ హిట్ ఆశలు నెరవేరుస్తుందో తెలియాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే. గార్జియస్ బ్యూటీ రకుల్ చెర్రీకి జోడీగా నటిస్తుండగా, అరవింద స్వామి విలన్ గా, నవదీప్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Dhruva  Censor Report  U by A  

Other Articles