అప్పటి నుంచి నారాయణ మూర్తితో మాటల్లేవ్.నన్ను తాకరాని చోట తాకాడు | Why Anchor Jhansi Fought with Narayana Murthy.

Anchor jhansi fought with narayana murthy

Anchor Jhansi, Telugu Anchor Jhansi, Actress Jhansi, Jhansi R.Narayanamurthy, R.Narayanamurthy, Narayanamurthy, R Narayana Murthy interview, R Narayana Murthy Jhansi, Anchor Jhansi Sexual Harassment

Anchor Jhansi open up about clash with Narayana Murthy and Harassment.

ఆర్.నారాయణమూర్తితో అసలు గొడవెందుకు వచ్చింది?

Posted: 11/11/2016 03:47 PM IST
Anchor jhansi fought with narayana murthy

పైకి నవ్వుతూ కనిపించే సెలబ్రిటీల మధ్య అంతర్గతంగా ఉన్న వైషమ్యాలు ఈ మధ్య వరుసగా బయటపడుతున్నాయి. సునీత-ఉదయభాను నుంచి మొదలు స్టార్ డైరక్టర్ లు అయిన బోయపాటి-పోసాని లాంటి వాళ్ల దాకా విమర్శలు చేసుకుంటుంటే... తెరవెనుక ఇలాంటివి ఇంకా చాలానే ఉండి ఉంటాయన్న భావన అందరిలోనూ నెలకొంటోంది. ఇదిలా ఉంటే ఓపెన్ గా మాట్లాడుతుందన్న యాంకర్ ఝాన్సీ కూడా తన లైఫ్ లో ఎదుర్కున్న సమస్యల గురించి ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఆ దశలో నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తితో ఉన్న గొడవ గురించి ఓపెన్ గా చెప్పేసింది. అప్పట్లో ఆయన ఓ సినిమాలో ఒక మంచి పాత్ర కోసం నన్ను తీసుకున్నారు. క్లైమాక్స్‌లో ఫైట్‌ కూడా చేసి సినిమాను లీడ్‌ చేసే మంచి క్యారెక్టర్‌ అని చెప్పారు. తీరా కొన్ని రోజులు షూటింగ్‌ పూర్తి చేసిన తర్వాత నా క్యారెక్టర్‌ను చంపేశారు. ఏమైందని అడిగితే.. సెట్‌లో నేను నలుగురితో కూర్చుని నవ్వడం, మాట్లాడడం నచ్చక క్యారెక్టర్‌ను ముగించేశామని నారాయణమూర్తి చెప్పారు. వెంటనే నేను షూటింగ్‌ స్పాట్‌ నుంచి వాకౌట్‌ చేశా. ఇప్పటివరకు అతనితో మాట్లాడింది లేదంటూ చెప్పింది ఝూన్సీ.

అంతేకాదు ఆడాళ్లను తక్కువ చేసే ఓ డైలాగ్ రాసిన సంపత్ నందితో విభేదించి మరీ ఆ డైలాగ్ ను మార్పించానని తెలిపింది. ఇదిలా ఉంటే ఆడాళ్లపై జరిగే దాష్టీకాలను సహించాల్సిన అవసరం లేదని చెబుతున్న ఝాన్సీ తనకు ఎదురైన ఓ అనుభవాన్ని వివరించింది. తాను 18 ఏళ్ల వయసులో ఉండగా ఓ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ తనను తాకరాని చోట తాకాడాని, వెంటనే రచ్చ చేసి మరీ అతని పరువు తీసేశానని చెప్పింది ఝాన్సీ. గతంలో జోగినాయుడు అనే నటుడిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత విబేధాలతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహిళల కోసం పలు టీవీషోలతోపాటు, ఇంకోపక్క సినిమాలతో కూడా బిజీగా గడిపేస్తుంది ఝాన్సీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu Anchor Jhansi  R.Narayanamurthy  

Other Articles