ధృవకి హ్యాండిచ్చి చిరు ఎక్కడికి చెక్కేశాడు? | Chiru and kajal heads to Europe for Romance

Khaidi no 150 unit heads to in europe

Megastar Chiranjeevi, Chiranjeevi Khaidi 15, Chiranjeevi Europe, Chiranjeevi kajal Agarwal, Kajal Agarwal, Chiru and kajal Dance, Chiru And Kajal Romance

Chiranjeevi And Kajal Agarwal fly to Europe for Romantic songs.

చిరు ఎక్కడికి వెళ్లాడు?

Posted: 11/11/2016 03:54 PM IST
Khaidi no 150 unit heads to in europe

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 షూటింగ్ మొన్నే 80 శాతం షూటింగ్ పూర్తయిందని చెప్పుకున్నాం. దీంతో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం షూటింగ్ లో పాల్గొని అల్రెడీ కొన్ని ఎపిసోడ్స్ పూర్తి కూడా చేశాడంట. అయితే ఓవైపు ధృవ ఆడియో వేడుక జరగకపోవటంతో చిరు అందులోనే బిజీగా ఉన్నాడేమో అని అంతా అనుకున్నారు. కానీ, చిరు మాత్రం ఇప్పుడు ఎంచక్కా విదేశాలకు చెక్కేస్తున్నాడు.  

ఓవరాల్ గా టాకీ పార్ట్ పూర్తయి పోవటంతో ఆ లెక్కన మిగిలింది పాటలు మాత్రమే. అయితే అల్రెడీ ఐటెం, టైటిల్ సాంగులు అయిపోయాయి కాబట్టి రొమాన్స్ ట్రాక్ లోకి షిఫ్ట్ కావాల్సిందే కదా. అందుకే రెండు పాటల చిత్రీకరణ కోసం కాజల్ తో కలిసి యూరప్ దేశాలకు వెళ్లాడటం. జానీ, శేఖర్ మాస్టర్ లు స్టెప్పులు సమకూరుస్తున్న ఈ పాటను స్లోవేనియా, క్రోయేషియాలోని అందమైన లోకేషన్లలో చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.

ఇక ఇప్పటికే 70 కోట్ల భారీ బిజినెస్ చేసిన ఈ చిత్రం మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుపుకుని సంక్రాంతి కోసం సిద్ధమౌతోంది. తెలుగు ప్రేక్షకులు మాత్రం బాలయ్య శాతకర్ణి, మెగా 150 మధ్య జరగబోయే కలెక్షన్ల వార్ కి సిద్ధమైపోతున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Kajal  Romantic Songs  Europe  

Other Articles

Today on Telugu Wishesh