దీపావళికి విజయ్, సూర్య ధమాకాలు | singam-3 motion poster and Bairavaa teaser out

Singam 3 motion poster and bairavaa teaser out

Vijays Bhairava teaser, Suriyas Singam 3 motion poster, Vjay and Suriya Diwali Dhamaka, Vijay up suriya down

Vijays Bhairava teaser and Suriyas Singam 3 motion poster out.

కోలీవుడ్ లో రెండు సెన్సేషన్స్ టీజర్లు

Posted: 10/28/2016 11:52 AM IST
Singam 3 motion poster and bairavaa teaser out

కోలీవుడ్ లో దీపావళి పండగకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈసారి అక్కడి ప్రేక్షకులు మాత్రం బడా హీరోలు కాకుండా ధనుష్, కార్తీ లాంటి స్టార్ల సినిమాలు కోడి, కాష్మోరాలతోనే సరిపెట్టుకున్నారు. రజనీ, విజయ్, అజిత్ లాంటి స్టార్ల సినిమాలు ఈసారి రేసులో లేకపోవటంతో వారి ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురయ్యారు. కానీ, టీజర్లతో అభిమానులను పండగ చేస్కోమంటున్నారు విజయ్ అండ్ సూర్యలు.

 

విజయ్ లేటెస్ట్ చిత్రం భైరవా టీజర్ గత రాత్రి నెట్ లో విడుదలైంది. భరతన్ డైరక్షన్ లో రాబోతున్న ఈ చిత్రం ఇదయదళపతి 60వ చిత్రం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు విలన్ రోల్ చేస్తున్నాడు. ఇక టీజర్ విషయానికొస్తే... పక్కా యాక్షన్ కట్లతో విడుదల చేసింది చిత్రయూనిట్. కబాలి ఫేం సంతోష్ నారాయణన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రచ్చ చేస్తోంది. విజయ్ మేనరిజమ్స్ కు దగ్గరగా ఉండేందుకు కూడా ట్రై చేసింది. ఇక శివాజీలో రజనీ రూపాయి కాన్సెప్ట్ లాగా ఇందులోనూ ఏదో పెట్టినట్లు అనిపిస్తోంది. అయితే ఇందులో విజయ్ డ్యుయల్ రోల్స్ చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించగా ఒక లుక్ ను మాత్రమే చూపించారు. మరో క్యారెక్టర్ లో విజయ్ గుండుతో కనిపించబోతున్నాడంట. దీపావళికి మిస్సయినప్పటికీ, పొంగల్ కి మాత్రం అదిరిపోయే ట్రీట్ ఇస్తానంటూ టీజర్ తో చెప్పేశాడు విజయ్.

మరోవైపు స్టార్ హీరో సూర్య సింగం-3 మోషన్ పోస్టర్ తో టీజర్ రిలీజైంది. నిజానికి ఈ చిత్రం దీపావళికే రిలీజ్ కావాలి. కానీ, తమ్ముడి భారీ ప్రాజెక్టు కాష్మోరాకు అడ్డుతగలటం ఇష్టం లేని సూర్య దానిని డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేశాడు. సింహం పరిగెత్తుకుంటూ వచ్చి అది సూర్యగా మారటం, చివర్లో సీరియస్ ఫేస్ తో సూర్య దర్శనమివ్వటం, ఆపై సింగం-3 బ్యానర్ అంతా బాగానే ఉంది. ఎటొచ్చి లుక్ పాతగానే ఉన్నా, హ్యారిజ్ జైరాజ్ మ్యూజిక్ మాత్రం కాస్త డిఫరెంట్ గానే ఉంది. మొదటి రెండు భాగాలకు సీక్వెల్ గానే సింగం-3 రాబోతుంది. ఇందులో అనుష్క, శృతీహాసన్ లు సూర్యకి జోడీగా కనిపించబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Bairavaa teaser  Suriya singam-3 motion poster  

Other Articles