ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా అంటున్న నాని | Nani Nenu Local first look poster out

Nani nenu local first look poster out

Nani Nenu Local first look, Nenu Local movie first look, Nani mass avatar for Nenu Local, nenu local firstlook, Nani Nenu Local first look poster

Nani Nenu Local movie first look poster out.

నేచురల్ స్టార్ పక్కా యాక్షన్ అవతార్

Posted: 10/28/2016 02:34 PM IST
Nani nenu local first look poster out

ఏడాదిలో మినిమమ్ చిత్రాలతో కలెక్షన్లు కురిపించి టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు నేచురల్ స్టార్ నాని. కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్మెన్, మజ్నులతో ఇప్పటికే హ్యాట్రిక్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు నాలుగో చిత్రాన్ని కూడా రెడీ చకా చకా షూటింగ్ పూర్తి చేయటమే కాదు, ఏకంగా ఫస్ట్ లుక్ ను వదిలేశాడు.

దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న నేను లోకల్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను దీపావళి సందర్భంగా ఈరోజు విడుదల చేశారు. సాధారణంగా తన ఫస్ట్ లుక్ లో క్రియేటివిటిన చూపే నాని, ఇందులోనూ అదే పని చేశాడు. సిగరెట్ అంటిస్తూ.. హ్యపీ దీపావళి అంటూ చెప్పేస్తున్నాడు. రఫ్ లుక్ లో ఉన్న పోస్టర్, టైటిల్ లో మందు తాగుతూ ఉన్న ఫోటో చూస్తుంటే పక్కా మాస్ మూవీలా అనిపిస్తుంది. ఈ చిత్రంలో బాబు అనే క్యారెక్టర్ లో నాని నటించబోతున్నాడు. క్వాలిఫికేషన్ నిల్... ఆటిట్యూట్ ఫుల్, ఇక్కడే పుట్టా... ఇక్కడే పెరిగా అంటూ నాని తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

సినిమా చూపిస్త మావ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. రాకింగ్ మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఫస్ట్ టైం నాని సినిమాకు ట్యూన్స్ అందిస్తున్నాడు. డిసెంబర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Nenu Local movie  firstlook poster  

Other Articles