ధ్రువ టీజర్ గ్యారేజ్ రికార్డు బ్రేక్ చేయలేదంట | cherry Dhruva teaser released

Cherry dhruva teaser released

Ram Charan Dhruva teaser, Dhruva Teaser record, Dhruva telugu movie, Dhruva teaser views, Dhruva movie business, Charan Dhruva Dussera Teaser

Ram Charan Dhruva Teaser Released.

రాంచరణ్ ధ్రువ స్ట్రాటజీ మారిపోయింది...

Posted: 10/12/2016 07:54 PM IST
Cherry dhruva teaser released

ఫస్ట్ లుక్ తో ధ్రువ పై నెలకొన్న నెగటివ్ ఫీడ్ బ్యాక్ ను తొలగించేసిన రాంచరణ్ ఇప్పుడు టీజర్ తో దుమ్ము రేగొడుతున్నాడు. విజయదశమి సందర్భంగా రిలీజైన ఈ టీజర్ విడుదలైన 14 గంటలలోనే 1 మిలియన్ వ్యూస్ ను సంపాదించేసింది. 21,000పైగా లైక్స్ ను సాధించింది. తమిళంలో ఎటువంటి అంచనాలు లేకుండానే జయం రవి హీరోగా వచ్చిన తని ఒరువన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మై ఎనిమీ ఈజ్ మై స్ట్రెంథ్ అనే కాన్సెప్ట్ ను దీనిని చెర్రీ తెలుగు కోసం స్వల్ఫ మార్పులు చేసి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.

'' నీ స్నేహితుడెవడో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది .. నీ శత్రువెవడో తెలిస్తే నీ కెపాసిటి తెలుస్తుంది .. నా శత్రువును నేను సెలెక్ట్ చేసుకున్నాను'' అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ జనంలోకి బాగా దూసుకుపోయింది. చరణ్ పోలీస్ ఆఫీసర్ లుక్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. సురేందర్ రెడ్డి స్టైలిష్ షాట్స్ తో ఈ టీజర్ ఒక రేంజ్ లో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 70 కోట్ల హక్కులకు ఈ చిత్ర రైట్స్ అమ్ముడు పోయిన విషయం తెలిసిందే. ఈ టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటం ఖాయమని చెప్పుకుంటున్నారు.

 

రకుల్ చెర్రీకి జోడీగా నటిస్తున్న ఈ చిత్రంలో అరవింద స్వామి విలన్ గా నటిస్తున్నాడు. హిప్ హాప్ థమీజ్ సంగీతం సమకూరుస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Dhruva Movie  Teaser  Dussera  

Other Articles