అభిమానులకు టాలీవుడ్ సెలబ్రిటీల వినాయక చవితి శుభాకాంక్షలు | tollywood celebrities wish fans on vinayaka chavithi

Ganesh chavithi greetings to fans from tolllywood celebrities

chirnajeevi, ram charan, vv vinayak, vinayaka chavithi, celebrations, telugu states, celebrities greetings, vinayaka chavithi celebrations, gahesh chaturthi, ganesh chavithi celebrations, hindus, historical temples, tollywood

On the eve of Ganesh Chaturthi nava ratri tollywood celbrities wish their fans and devotees by warm greetings

అభిమానులకు టాలీవుడ్ సెలబ్రిటీల వినాయక చవితి శుభాకాంక్షలు

Posted: 09/06/2016 09:39 AM IST
Ganesh chavithi greetings to fans from tolllywood celebrities

దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవ వేడుకలను జరపుకుంటున్న నేపథ్యంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులకు విఘ్నాలు తొలగాలని, వారు తలపెట్టిన శుభకార్యాలు నిర్విఘ్నంగా పూర్తికావాలని టాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కొందరు తమ ఇంట వేడుకలను షేర్ చేశారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ తో కలసి తన ఇంట్లోనే వినాయక చవితిని జరుపుకున్నారు. పర్యావరణానికి ప్రాధాన్యతను ఇస్తూ సెలబ్రిటీలు కూడా మట్టి విగ్రహాలనే ప్రతిష్టించి.. పూజలు నిర్వహించారు. గణపతి పూజ చేసుకుని.. ఆ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆభిమానులకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలను తెలుపుతూ వారు పూజకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఫోస్టు చేశారు.

తొలిసారి పండుగ జరుపుకున్నట్లు హీరోయిన్ చార్మీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది.  స్వతహాగా పంజాబీ అయినా.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెటిలైపోవడంతో తెలుగు సంప్రదాయాలను కూడా చార్మీ పాటిస్తోంది.
షూటింగ్ కారణంగా ఇంటికి దూరంగా ఉన్న వరుణ్ తేజ్ ఇంట్లో పండుగ సందడిని షేర్ చేశారు. కాజల్ అగర్వాల్, మంచు మనోజ్, కళ్యాణ్ రామ్, మంచు విష్ణు, దేవీ శ్రీ ప్రసాద్, వరుణ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా భాటియా, సాయి ధరమ్ తేజ్, రామ్ పోతినేని, అల్లు శిరీష్ లు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles