గెలుపోటములతో సంబంధం లేకుండా తనకు మూవీ వరల్డ్ న్న అచాట్ మెంట్ నేపథ్యంలో సినిమాలను తీస్తూ.. ప్రేక్షకుల ముందుకు వచ్చే కళ్యాణ్ రామ్.. తన 'పటాస్' చిత్రం హిట్ కొట్టిన నేపథ్యంలో చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సారి కళ్యాణ్ రామ్ ను ఇజం పేరుతో ముందుకు తీసుకువస్తున్నది మాత్రం మాస్ సినిమాలకు పెట్టిందిగా పేరుగాంచిన పూరి జగన్నాథ్. ఈ నందమూరి యంగ్ హీరో మాస్ బాట పట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాలో నటిస్తుండడంతో నందమూరి అభిమానుల్లో కళ్యాన్ రామ్ కొత్త లుక్ పై ఉత్కంఠ రేకెత్తుతుంది.
టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ను సిక్స్ ప్యాక్ లో చూపించిన పూరీ, ఈ మూవీ కోసం కళ్యాణ్ రామ్ తో సిక్స్ ప్యాక్ చేయించాడు. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఇజం మూవీ థియరిటికల్ ట్రైలర్ సెప్టెంబర్ క్రితం రోజున విడుదలైంది. తమ అభిమాన హీరో సిక్స్ ప్యాక్ లో ఎలా కనిపిస్తాడో చూడాలని నందమూరి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దీంతో ఇజం ట్రైలర్ ను యూట్యూబ్ లో ఇప్పటికే 3.5 లక్షల మంది వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.
ఇటీవలే స్పెయిన్‌లో ఇజం మూవీ భారీ షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల మూవీలేవీ లేకపోవడంతో ఇజం మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తూ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ జోడీగా అదితీ ఆర్య కనిపించనుంది. విజయ దశమి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తుంది. జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ల భరణి, పోసాని తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. అలస్యమెందుకు మీరు ఓ లుక్ వేయండీ..
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more