జాకీచాన్ కి అస్కార్ గౌరవ పురస్కారం | Jackie Chan awarded honorary Oscar

Jackie chan awarded honorary oscar

Jackie Chan Oscar Lifetime achievement, Jackie Chan Oscar award, great honour to jackie chan, Jackie Chan awarded honorary Oscar

JACKIE CHAN TO RECEIVE LIFETIME ACHIEVEMENT OSCAR.

జాకీకి ఆస్కార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు

Posted: 09/02/2016 04:47 PM IST
Jackie chan awarded honorary oscar

మార్షల్ ఆర్ట్స్ చిత్రాలంటే ఎవరికైనా టక్కున గుర్తుచ్చొ పేరు జాకీచాన్. 62 ఏళ్ల వయసులోనూ కెరీర్ మొదట్లో ఎలాగయితే గెంతులు వేశాడో ఇప్పుడు కూడా అదే స్థాయిలో కుంగుఫూ ఫైట్లు చేస్తూ ఆశ్చర్యాలకు గురిచేస్తుంటాడు. అలాంటి జాకీకి ఆస్కార్ లైఫ్ టైం అవార్డును ప్రకటించారు.

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ (ఆంపాస్) సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రతి ఏటా గవర్నర్స్ అవార్డుల ప్రదానోత్సవాలను అకాడమీ నిర్వహిస్తుంది. ఈ నవంబర్ లో లాస్ ఏంజెల్స్ లో నవంబర్ 12న నిర్వహించబోయే 2016 గవర్నర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని జాకీచాన్ అందుకోనున్నారు. జాకీచాన్ తో పాటు డాక్యుమెంటరీ నిర్మాత ఫ్రెడరిక్ వైజ్ మాన్, బ్రిటిష్ ఫిల్మ్ ఎడిటర్ యాన్నె వి.కోట్స్, కాస్టింగ్ డైరైక్టర్ లిన్ స్టాల్ మాస్టర్ కూడా ఈ ఏడాది గవర్నర్స్ అవార్డులను అందుకోనున్నారు.

1978లో స్నేక్స్ ఇన్ ద ఈగల్ షాడో చిత్రంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన జాకీ, 1980లో హాలీవుడ్ చిత్రం ది బిగ్ బ్రాల్ తో యూఎస్ బాక్సాఫీస్ ను శాసించాడు. అక్రోబాటిక్ ఫైటింగ్ స్ట‌యిల్‌, కామిడీ స్టంట్స్‌, ఆధునాత‌న ఆయుధాలతో సినిమాల‌ను ఆస‌క్తిక‌రంగా ప్రజెంట్ చేయ‌డంలో చాకీ చాన్ దిట్ట‌. కాగా, ఇప్పటివరకు 30కి పైగా మార్షల్ ఆర్ట్స్ సినిమాల్లో జాకీచాన్ నటించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jackie Chan  Oscar Lifetime achievement  martial arts hero  

Other Articles