తెరపైకి సల్మాన్ పెళ్లి వార్తలు మళ్లీ | Salman Khan wants to marry Iulia Vantur on November 18 this year

Salman khan wants to marry iulia vantur on november 18 this year

Salman Khan wants to marry Iulia Vantur, Salman Khan Iulia Vantur, special day in salman life, salman marriage day, Salman mariage date fixed, salman marriage 2016, Salman Khan 2016 marriage, Salman Khan november 18, mumbai mirror on salman marriage

Salman Khan wants to marry Iulia Vantur on November 18 this year.

సల్మాన్ పెళ్లి ఆరోజే ఎందుకో తెలుసా?

Posted: 09/02/2016 05:49 PM IST
Salman khan wants to marry iulia vantur on november 18 this year

బాలీవుడ్ లో మోస్ట్ డిస్కషన్ టాపిక్ లలో ఒకటి కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి. సల్మాన్ తన ప్రియురాలు లులియా వంటర్‌ని ఎప్పుడు పెళ్లాడాతాడు? అంటూ అనేక సందేహాలు బాలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి. ఓ రొమానియన్ పత్రిక అయితే ఏకంగా ఓ అడుగు ముందుకేసి అల్రెడీ సల్మాన్ మా దేశ అల్లుడు అయిపోయాడు అంటూ కథనాలు ప్రచురించింది. అఫ్ కోర్స్ అదంతా ఉత్తదేనని ఆ తర్వాత సల్మాన్ తేల్చేశాడనుకోండి. ఇక లులియా అయితే తాము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఓ బాంబు వేసి పడేసింది.

గతంలో ఫ్రెండ్స్,. ఇప్పుడు ఫ్రెండ్స్.. ఎప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉంటామని క్లారిటీ పేరుతో సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అయితే గతంలో ఓసారి పెళ్లి ఎప్పుడు అంటే నవంబర్ 18న కానీ, ఏ సంవత్సరమో మాత్రం చెప్పనంటూ సల్మాన్ చెప్పిన విషయం గుర్తుంది కదా! తాజాగా అందుతున్న సంకేతాలు వీరిద్దరు ఆరోజునే ఒకటి కాబోతున్నారా అన్న డిస్కషన్ మళ్లీ మొదలైంది. ముంబైకి చెందిన కొన్ని పత్రికలు చెబుతున్న సంగతి ఏంటంటే... అదే రోజు సల్మాన్ తల్లిదండ్రుల పెళ్లిరోజు. ఈ యేడాది సలీమ్ ఖాన్, సల్మా 52వ పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. అందుకే ఆ తేదీనే కొంతమంది బంధువుల సమక్షంలో సల్మాన్ లూలియాను పెళ్లడబోతున్నాడనే ఆ కథనం సారాంశం. అంతేకాదు లులియా వీసా గడువు నవంబర్ తో ముగుస్తుందని, ఆ దశలో సల్మాన్ ను పెళ్లి చేసుకుని ఆమె ఇక్కడే స్థిరపడిపోతుందని కూడా అందులో పేర్కొన్నారు.

ఇక అదే రోజు మరో విశేషం కూడా ఉంది. సల్మాన్ చెల్లి ఆర్పిత 2014 నవంబర్ 18న ఆయుష్ శర్మను హైదరాబాద్ తాజ్ ఫలక్ నుమాలో ఘనంగా పెళ్లి చేసుకుంది. అందుకే తన రెండో పెళ్లి రోజును అన్నయ్య పెళ్లితో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తోందట అంటూ రకరకాల కథలతో స్టోరీలు రాసేసింది. ఈ వార్తల్లో నిజం మాట అటుంచి 50 ఏళ్ల సల్మాన్ ఇన్ని ప్రత్యేకతలున్న ఆరోజే ఒక ఇంటివాడు అయితే మాత్రం ఎంత బావుంటుందో కదా!  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Iulia Vantur  marriage date  fix  

Other Articles