Pawan daughter aadhya desire on her father birthday

Pawan daughter aadhya desire on her father birthday

Pawan daughter aadhya, aadhya desire on pawan birthday, What aadya ask to renu desai on pawan's birthday, aadya ask to renu desai, pawan daughter wishes

Pawan daughter aadhya desire on her father birthday. Ask Renu Desai to put pawan's Pic in her mobile.

పుట్టినరోజు పవన్ కూతురి కోరిక విన్నారా?

Posted: 09/02/2016 03:57 PM IST
Pawan daughter aadhya desire on her father birthday

నటుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ నటనకు, వ్యక్తిత్వానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అటువంటి వారిలో మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా ఉంది. తన నుంచి విడిపోయినప్పటికీ ఏదో ఒక రూపంలో పవన్ పై అభిమానాన్ని చూపుతూనే ఉంటుంది. గత నాలుగు రోజుల నుంచి పవన్ ఫోటోలను షేర్ చేస్తూ గతాన్ని గుర్తుచేసుకున్న రేణూ, ఇఫ్పుడు మరో ఆసక్తికర ట్వీట్ చేయటం చర్చకు దారితీసింది.

పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేళ, ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన ఈ ట్వీట్ పై పవన్ అభిమానులంతా హ్యాపీగా ఫీలవుతున్నారు. తండ్రి పుట్టిన రోజు వేళ, తన కుమార్తె ఆద్య రేణుతో "అమ్మా, ఇవాళ నాన్న పుట్టినరోజు. కాబట్టి నువ్వు తప్పనిసరిగా నాన్న పిక్చర్ నీ ఫోన్ లో పెట్టుకోవాల్సిందే" అన్నదట. ఆ వెంటనే కుమార్తె కోరికను తీర్చాలని భావించిన రేణు, పవన్ ఫోటోను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టిందట. ఈ విషయాన్ని రేణు ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న పవన్ అభిమానులు, థ్యాంక్యూ వదినమ్మా, క్యూట్ డాటర్, నైస్, సూపర్ అంటూ కామెంట్లు వదులుతున్నారు.

ప‌వ‌న్ పై ప్రేమ ను నానాటికీ పెంచుకుంటూ పోతున్న ఆ తల్లిబిడ్డలు, తాజా ఉదాహరణతో వారి హృదయంలో పవన్ కి ఎంత స్థానం ఉందో చెప్పకనే చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  daughter  Aadhya  birthday  renu desai  tweet  

Other Articles