పెళ్లి వేడుకకు జంటగా హాజరైన చైతూ-సమంత | Naga Chaitanya and Samantha pair attend Nimmagada daughter’s wedding

Naga chaitanya and samantha pair attend nimmagada daughter s wedding

Naga Chaitanya and Samantha, Naga Chaitanya and Samantha officially announced, Naga Chaitanya and Samantha nimmagadda daughter wedding, nimmagadda prasad daughter swathi wedding, samantha with Akkineni Family, Samantha made it official

Naga Chaitanya and Samantha, along with Nagarjuna and Akhil, have attended the marriage of Nimmagada Prasad’s daughter’s that was held in Hyderabad recently.

చైతూ-సమంత అఫీషియల్ గా చెప్పేశారు

Posted: 08/29/2016 09:26 AM IST
Naga chaitanya and samantha pair attend nimmagada daughter s wedding

అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు ఎప్పుడు మోగుతాయో తెలియదు కానీ... ఈ విషయంపై తెలుగు సినీ రంగంలో పెద్ద ఎత్తున చర్చ మాత్రం జరుగుతూనే ఉంది. అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య, టాప్ హీరోయిన్ సమంతలు ప్రేమ, ఆపై పెళ్లి చేసుకోనున్నారని ఇదిగో ఫలానా డేట్, అదిగో వేదిక అంటూ నాలుగు నెలలుగా మీడియా నోళ్లలో నానుతూనే ఉంది.

వీటన్నింటికి చెక్ పెడుతూ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతోపాటు సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు మీడియాకు స్వయంగా చెబుతానని నాగ్ మీడియా ప్రకటనలు చాలానే ఇచ్చాడు. అయితే దీనిపై ఇరువర్గాలు ఈ మధ్య నోరెత్తకపోవడంతో, సమంత కూడా సినిమాలపై దృష్టిసారించడంతో ఇప్పుడిప్పుడే ఈ విషయం కాస్తంత సద్దుమణిగింది.

కానీ, నిన్న హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఓ వివాహ వేడుక మరోమారు ఈ విషయంపై చర్చకు తెర లేపింది. ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె వివాహం ఎన్ కన్వెన్షన్ లో జరగ్గా, ఆ వివాహ వేడుకకు చైతూ, సమంతలు ఇద్దరూ జంటగా హాజరయ్యారు. నాగ్, అఖిల్ తోపాటు వీరిద్దరు నవ్వుతూ అందరినీ పలకరించారు. మీడియాకు చిక్కిన వీరి ఫొటోలు సోషల్ మీడియాకు ఎక్కాయి. వెనువెంటనే సదరు ఫొటోలు వైరల్ గా మారగా... చైతూ, సమంతల పెళ్లి వార్తలు మళ్లీ జోరందుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Chaitanya  Samantha  Akkineni Family  Nimmagadda satyanarayana  daughter  Swathi  wedding  

Other Articles