రాజ్ రీ బూట్ ట్రైలర్ లో హాట్ గా కృతి కర్బంద | Kriti Kharbanda hot avatar in Raaz Reboot

Kriti kharbanda hot avatar in raaz reboot

Kriti Kharbanda hot in Raaz Reboot, Raz Reboot actress, Raz Rebbot intimate scenes, Kriti Kharbanda bollywood debut, Kriti Kharbanda Imran Hashmi

Kriti Kharbanda hot avatar in Raaz Reboot.

పాపం పవన్ హీరోయిన్ ఇలా...

Posted: 08/16/2016 04:38 PM IST
Kriti kharbanda hot avatar in raaz reboot

సౌత్ సినిమాల్లో కాస్త పద్ధతిగల పాత్రల్లోనే నటించి మంచి పేరునే సంపాదించుకుంది కృతి కర్బంద. కానీ, ఆ ట్యాగ్ లైన్ ఈ కన్నడ బ్యూటీకి ఆఫర్లు ఏం తెచ్చిపెట్టలేదు సరికాదా స్టార్ హీరోయిన్ల సరసన అక్కా, చెల్లెల్లి పాత్రలకు పరిమితం చేసేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన చేసింది అని పేరుకే తప్పించి ఆమె ఖాతాలో ఏం లేకపోయింది. బ్రూస్ లీ చెర్రీ సోదరిగా నటించినప్పటికీ అది ఏ మాత్రం వర్కవుట్ కాలేదు. దీంతో బాలీవుడ్ లో లక్ ను పరిశీలించుకోబోతుంది.

అయితే ఈ క్రమంలో ఆమె బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలో నటిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ప్రస్తుతం విక్రమ్ భట్ దర్శకత్వంలో రాబోతున్న రాజ్ రీ బూట్ (రాజ్ 4) చిత్రంలో హీరోయిన్ గా నటించబోతుంది. ఈ చిత్ర ట్రైలర్ ను తాజాగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఇందులో కృతి సనన్ గృహిణిగా, ఆత్మలు బారిన పడి వేధింపులకు గురయ్యే బాధితురాలిగా  కనిపించనుంది. కృతి భర్త పాత్రలో గౌరవ్ అరోరా నటిస్తుండగా, ఆమె మాజీ ప్రేమికుడిగా, ఆత్మల నుంచి కాపాడే వ్యక్తి పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటించాడు.

ఓవైపు భర్త పాత్రధారి గౌరవ్ తో రొమాంటిక్ సీన్లతోపాటు ఇంకోవైపు ఇమ్రాన్ తో కూడా మూతిముద్దులు కానిచ్చేసింది కృతి. భట్ ప్యామిలీ నుంచి రాబోతున్న ఈ హర్రర్ చిత్రం సెప్టెంబర్ 16న విడుదలకానుంది. హద్దులన్నీ చెరిపేసిందా.. ముద్దులతో హాట్ గా రెచ్చిపోయిన కృతికి ఇప్పటికైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kriti Kharbanda  Raaz Reboot  Imran hashmi  

Other Articles