బాహుబలి-2 లో సుదీప్ అనుమానమే | sudeep no more in baahubali 2

2

Sudeep in baahubali 2, Sudeep baahubali, Baahubali sudeep, Sudeep as Aslam Khan, Aslam Khan no more in Baahubali 2, Sudeep about baahubali 2

sudeep doubt in baahubali 2. Says in twitter baahubali unit not approached still.

బాహుబలి-2 కీలకపాత్ర కట్ ?

Posted: 08/16/2016 05:49 PM IST
2

రీమేక్ ల పుణ్యమాని కన్నడలో స్టార్ హీరో అయిపోయిన సుదీప్ ను ‘ఈగ’ సినిమాతో తెలుగులోకి తెప్పించాడు రాజమౌళి. ఇండియన్ వైడ్ గా గుర్తింపు ఉన్న సుదీప్ లాంటి అగ్రహీరోతో విలన్ గా చేయించినప్పటికీ అందులోని ఫీట్లకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ఆపై బాహుబలి లాంటి ప్రిస్టిజియస్ ప్రాజెక్టులో అస్లాం ఖాన్ అంటూ పోస్టర్ దగ్గరి నుంచి తెగ హడావుడి చేశాడు.  తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఓ అయిదు నిమిషాలు ఇలా కనిపించి అలా మాయమయ్యాడు.

అయితే రెండో భాగంలో మాత్రం ఆ పాత్రను ఖచ్చితంగా జక్కన్న హైలెట్ చేస్తాడని తరుణంలో ఒక్కసారిగా గాలి తీసేశాడు సుదీప్. రెండో భాగం నుంచి ఇంతవరకు చిత్రయూనిట్ నుంచి తనకు పిలుపు అందలేదంటూ బాంబ్ పేల్చాడు. రీసెంట్ గా సుదీప్ నటించిన కోటిగొబ్బా-2 సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్విట్టర్ లో అభిమానులతో చాటింగ్ చేస్తుండగా, ఓ అభిమాని బాహుబలి-2 గురించి అడిగిన ప్రశ్నకు ట్వీట్ వేశాడు. అసలు సినిమాలో తాను నటించేది లేనిది తనకే తెలీదంటూ చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం బాహుబలి 2 కి సంబంధించి క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ నెలన్నర రోజుల నుంచి నిరాటంకంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంతవరకు సుదీప్ కి జక్కన్న నుంచి పిలుపు రాకపోవటంతో సెకండ్ పార్ట్ లో లేడనే వార్తలే దాదాపు కన్మర్ఫ్ చేసుకోవచ్చు.

‘‘బాహుబలి: ది కంక్లూజన్’లో అస్లాం పాత్ర కీలకం అవుతుందని.. చివర్లో భల్లాలదేవుడితో యుద్ధం చేయాల్సి వచ్చినపుడు కట్టప్ప-శివుడు.. ఈ పర్షియన్ రాజు సాయమే తీసుకుంటారని., టోటల్ గా సుదీపే చివర్లో కీలకం అవుతాడని ఎవరికి తోచిన కథలు వారు రాసేసుకున్నారు. ఇక ఇప్పుడు సుదీప్ రియాక్షన్ తో అస్లాం ఖాన్ కట్టప్ప దగ్గర కత్తులు కొనడానికే తప్ప ఎందుకు పనికిరాడని జోకులు పేల్చుకుంటున్నారు. దీనిపై రాజమౌళి నేరుగా స్పందిస్తే బెటరేమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  the conclusion  Sudeep  Aslam Khan  

Other Articles