బాహుబలి 2 రిలీజ్ డేట్ మళ్లీ మారింది | karan johar again tweeted baahubali 2 release date

Karan johar again tweeted baahubali 2 release date

baahubali 2 release, baahubali 2 release date again change, baahubali 2, baahubali karan johar, baahubali 2, karan johar about baahubali, Rajamouli Baahubali 2

karan johar again tweeted baahubali 2 release date.

బాహుబలి 2 రిలీజ్ డేట్ ఎందుకు మారింది?

Posted: 08/06/2016 09:02 AM IST
Karan johar again tweeted baahubali 2 release date

భారతీయ సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది 'బాహుబలి'. రాజమౌళి నిర్మించిన ఈ చిత్రం దాదాపు 600 కోట్లకి పైగా ఈ సినిమా వసూలు చేసి మన సినిమా ఎందులోనూ తీసిపోదని నిరూపించింది. ఫస్ట్ బాగంలో ఇచ్చిన ట్విస్ట్ తో జనాలంతా రెండో పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

అలాంటిది అప్పట్లో రిలీజ్ డేట్ ఏప్రిల్ 14, 2017 అని ప్రకటించేశాడు హిందీ నిర్మాత కరణ్ జోహార్. కానీ, ఏమైందో తెలీదుగానీ ఇప్పుడు మళ్లీ రిలీజ్ డేట్ మారిందంటూ మరో ట్వీట్ చేశాడు. ముందుగా చెప్పినట్లు కాకుండా ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని చెప్పేశాడు. అయితే దానికి బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది.

అది క్లైమాక్సే నంట. ఈ చిత్ర ముగింపు కోసం జక్కన్న ఏకంగా 32 కోట్లు వెచ్చించబోతున్నాడని తెలుస్తోంది. భారీగా ఉండబోయే ఈ క్లైమాక్స్ లో చిత్ర తారాగణంతోపాటు రెండువేల మంది పాల్గొనబోతున్నారంట. మధ్యలో గ్యాప్ ఇచ్చి ఆ పార్ట్ ను షూట్ చేయనున్నట్లు సమాచారం. అందుకే రిలీజ్ డేట్ మరోసారి ఛేంజ్ అయ్యింది. బాలీవుడ్ లో తొలిభాగాన్ని రిలీజ్ చేసిన కరణ్ జోహార్ ఇప్పుడు తన ధర్మ ప్రొడక్షన్ ద్వారానే రెండో భాగాన్ని రిలీజ్ చేయనున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. భారీస్థాయిలో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karan Johar  Baahubali 2  release date  

Other Articles