మహేష్ మురగదాస్ ఫస్ట్ షెడ్యూల్ పాట కోసం | first schedule completely for Mahesh Murugadoss movie song

First schedule completely for mahesh murugadoss movie song

Mahesh Murugadoss Movie, Mahesh intro song from murugadoss, murugadoss special care for mahesh, mahesh murugadoss first schedule,

First schedule completely for Mahesh Murugadoss movie song.

సాంగ్ కోసమే షెడ్యూల్ మొత్తం

Posted: 08/05/2016 11:07 AM IST
First schedule completely for mahesh murugadoss movie song

ఓ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు అంటే ఎలా ఉంటాయో చూపిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. షూటింగ్ ప్రారంభమైన రోజు నుంచి అప్ డేట్స్ ఏంటి? అని ప్రేక్షకులు ఎదురుచూస్తుండటమే అందుకు తార్కాణం. ప్రస్తుతం స్టార్ డైరక్టర్ మురగదాస్ సినిమా కోసం రేయింబవళ్లు శ్రమించేందుకు సిద్ధమయ్యాడు.

టైటిల్ ఇంకా ఫిక్స్ కానీ, ఈ చిత్రం జూలై 29వ తేదీన మొదలైన ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల 12వ వరకూ కొనసాగనుంది. మొదటి షెడ్యూల్ మొత్తం ఇంట్రో సాంగ్ కే కేటాయించడం విశేషం. పూర్తి నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరిస్తున్న ఈ పాటను డాన్స్ కమ్ యాక్షన్ మిక్స్ చేసి తీయిస్తున్నాడంట. అంటే దాదాపు మహేష్ గతంలో తీసిన పోకిరి, దూకుడు, ఆగడు, చిత్రాల్లో లాగా అన్న మాట. మరో వారం కొనసాగనున్న ఈ పాట కోసం మహేష్ లుక్ టోటల్ గా ఛేంజ్ చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో లీకేజీలు లేకుండా జాగ్రత్త పడుతున్నాడంట మురగదాస్.

ఇక రెండో షెడ్యూల్ ఈ నెల 18 నుంచి ప్రారంభించి నిరవధికంగా షూటింగ్ పూర్తి చేయబోతున్నాడని తెలుస్తోంది. ఆ షెడ్యూలోనే చిత్ర హీరోయిన్ రకుల్ జాయిన్ అవుతుందని సమాచారం. దర్శకుడు ఎస్ జే సూర్య, నదియా ముఖ్య పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అన్నట్లు మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని చెబుతున్నప్పటికీ, ఈ విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Murugadoss  title song  

Other Articles