మొరాకోలో గౌతమీపుత్ర షూటింగ్ స్టార్ట్ | Gautamipurta Satakarni Shootings Starts Today

Gautamipurta satakarni shootings starts today

Gautamipurta Satakarni Shooting updates, Gautamipurta Satakarni movie updates, Gautamipurta Satakarni stills, Gautamipurta Satakarni posters, రాజకీయాలు, గరంగరం, క్రీడలు, కామెడీ, Fun, Entertainment, Spicy Videos, Movies, News, Gossips, Sports, Fashion, Style, Comedy, Hotels, Tickets, Balakrishna stills

Gautamipurta Satakarni Shootings Starts Today: Nandamuri Balakrishna 100th film Gautamipurta Satakarni Shootings Starts Today. Krish Director.

మొరాకోలో గౌతమీపుత్ర షూటింగ్ స్టార్ట్

Posted: 05/09/2016 09:28 AM IST
Gautamipurta satakarni shootings starts today

తెలుగు ప్రేక్షకలు, నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టీజియస్ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఇటీవల లాంచనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలుగుజాతి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన తెలుగు చక్రవర్తి జీవితాన్ని వెండితెరపై సాక్షాత్కరింప చేయనున్నారు దర్శకుడు జాగర్లమూడి క్రిష్. బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాని నిర్మిస్తున్నారు. ఇటీవల జాతీయ అవార్డును సొంతం చేసుకున్న క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేశారు.

ఎన్నో హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పనిచేయనున్నారు. నందమూరి బాలకృష్ణ తన వందవ చిత్రంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా టైటిల్ అనౌన్స్ చేయగానే సినిమా ఎలా ఉంటుందోనని సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్లే సినిమా కోసం, పాత్ర కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే బాలకృష్ణను ఈ సినిమా కోసం లుక్ నుండి ప్రతి విషయంలో కేర్ తీసుకుని సన్నద్ధం చేస్తున్నారు దర్శకులు క్రిష్. మొరాకోలోని అద్భుతమైన లోకేషన్స్ లో ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మే 9న ప్రారంభం కానుంది. ఒకటవ శతాబ్దానికి చెందిన సీన్స్ ను, రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో హాలీవుడ్ ఫైటర్స్ తో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అల్రెడి మ్యూజిక్ స్టార్ట్ చేసేశారు. అన్నీ విధాలుగా అందరినీ అలరించే చిత్రాన్ని రూపొందించేలా సన్నాహాలు చేస్తున్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Gautamipurta Satakarni  Movie News  

Other Articles