ఒక్క అమ్మాయి తప్ప పాటల సందడి | Okka Ammayi Tappa Music Launch

Okka ammayi tappa music launch

Okka Ammayi Tappa Music Launch, Okka Ammayi Tappa Songs, Okka Ammayi Tappa Trailers, Okka Ammayi Tappa Videos, Okka Ammayi Tappa stills, Okka Ammayi Tappa posters, Sundeep kishan, Nithya menon, రాజకీయాలు, గరంగరం, క్రీడలు, కామెడీ, Fun, Entertainment, Spicy Videos, Movies, News, Gossips, Sports, Fashion, Style, Comedy, Hotels, Tickets, Nithya menon stills

Okka Ammayi Tappa Music Launch: Tollywood actor Sundeep kishan latest film Okka Ammayi Tappa. This film Music Launched.

ఒక్క అమ్మాయి తప్ప పాటల సందడి

Posted: 05/09/2016 09:48 AM IST
Okka ammayi tappa music launch

సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో సందీప్ కిషన్, నిత్యామీనన్, వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, సాయిదరమ్ తేజ్, రాశిఖన్నా, రెజీనా, మిక్కి జె.మేయర్, రవికిషన్ తదితరులు సహా యూనిట్ సభ్యులందరూ హజరయ్యారు.

బిగ్ సీడీని వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. ఆడియో సీడీలను సాయిధరమ్ తేజ్ ఆవిష్కరించి తొలి సీడీని బోయపాటి శ్రీనుకు అందజేశారు. అనంతరం సందీప్ కిషన్ మాట్లాడుతూ.... స్త్రీలను గౌరవిస్తే అక్కడ దేవతలుంటారు అని చెప్పే సినిమా. ఒక మంచి సినిమాలో, హిట్ సినిమానో తీయడానికి చేసిన ప్రయత్నం కాదు, గొప్ప సినిమా తీయడానికి చేసిన ప్రయత్నం. రాజసింహ కమర్షియల్ డైరెక్టర్, నాపై నమ్మకంతో ఈ కథను నాకు ఇచ్చినందుకు ఆయనకి థాంక్స్. ఈ సినిమా కోసం ఛోటా మామ డబ్బులు తీసుకోకుండా వర్క్ చేశారు. మిక్కితో రెండోసారి వర్క్ చేస్తున్నాను. నిర్మాతగారు మమ్మల్ని నమ్మి ఈ సినిమా చేసినందుకు ఆయనకు థాంక్స్. ఈ సినిమా మా మూడు సంవత్సరాల నమ్మకం. నా బెస్ట్ పెర్ ఫార్మెన్స్ చూస్తారు. ఆ క్రెడిట్ లో ఎక్కువభాగం నిత్యామీనన్ కే దక్కుతుంది. అందరికీ థాంక్స్ అన్నారు.

నిత్యామీనన్ మాట్లాడుతూ... ఇది దర్శకుడి చిత్రం. నేను చూసిన రైటర్స్ లో ఎంటర్ టైనింగ్ గా, కంటెంట్ బేస్డ్ గా గ్రిప్పింగ్ కథను రాసుకున్నారు. ఒక్క నిమిషం కూడా బోర్ ఫీల్ కారు. ఈ సినిమానే కాకుండా రాజసింహ చేసే ప్రతి సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాను హిట్ గా నేను ఫీలయ్యాను. సందీప్ అమేజింగ్ కోస్టార్. మిక్కీ వండర్ ఫుల్ సాంగ్స్ ఇచ్చాడు. ఆ సాంగ్స్ వినగానే సోల్ టచింగ్ గా అనిపించింది. సినిమాను అందరూ ఆదరించాలి అన్నారు.

సందీప్ కిషన్, నిత్యా మీనన్, రేవతి , రవి కిషెన్, అలీ, అజయ్,బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, రాహుల్ దేవ్, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్,నళిని, జ్యోతి,రేవతి తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: ఛోటా కె.నాయుడు, ఆర్ట్‌: చిన్నా, మ్యూజిక్‌: మిక్కి జె.మేయర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు : శ్రీమణి, శ్రీ శశి జ్యోత్న్స మరియు డాక్టర్ మీగడ రామలింగ శర్మ , ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆళ్ళ రాంబాబు, సహ నిర్మాతలు : మాధవి వాసిపల్లి, బోగాది స్వేచ్ రెడ్డి , నిర్మాత: బోగాది అంజిరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : రాజసింహ తాడినాడ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Okka Ammayi Tappa  Sundeep kishan  Nithya menon  

Other Articles