Mahesh Babu visits adopts village in Andhra Pradesh, launches development works worth Rs 2.14 crore

Mahesh babu visits burripalem

Mahesh Babu, Andhra Pradesh, Burripalem, Tenali, Adoption, Guntur, mahaboobnagar, kothur, siddapur,Telangana

Mahesh Babu adopted a village in Andhra Pradesh's Guntur district and launched several development works worth about Rs 2.14 crore

బుర్రిపాలెం బుల్లోడు ఊళ్లో సందడి చేశాడు..

Posted: 05/08/2016 04:47 PM IST
Mahesh babu visits burripalem

శ్రీమంతుడికి బ్రహ్మోత్సవం కూడా కలసివస్తుందన్న పాజిటివ్ టాక్ సినీవర్గాల్లో ముఖ్యంగా ప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతున్న తరుణంలో ఆయన కూడా వర్క్ నుంచి కొంత ఉపశమనం పోందాలని ఏకంగా తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెంలో ఇవాళ పర్యటించారు. తన దత్తత గ్రామంలో విద్య, ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే తన లక్ష్యమని హీరో మహేశ్ బాబు అన్నారు. సొంతూరిని దత్తత తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో సుమారుగా రెండో కోట్ల 17 లక్షల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. బుర్రిపాలెంకు రావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. బుర్రిపాలెం పాఠశాలను బాగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇక్కడకు మళ్లీ మళ్లీ వస్తానన్నారు. కాగా తాను దత్తత తీసుకున్న మరో గ్రామానికి కూడా ఈ నెలలో వెళ్తానని చెప్పారు. తెలంగాణలో తాను దత్తత తీసుకున్న గ్రామానికి వచ్చే వారం వెళ్లనున్నట్టు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ మండలం సిద్ధాపూర్‌ గ్రామాన్ని కూడా ఆయన దత్తత తీసుకున్నారు. కాగా మహేష్ రాకతో బుర్రిపాలెంలో పండగ వాతావరణం నెలకొనగా... 70 మంది బౌన్సర్లతో 'ప్రిన్స్'కు భద్రత కల్పించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Andhra Pradesh  Burripalem  Tenali  Adoption  Guntur  mahaboobnagar  kothur  siddapur  Telangana  

Other Articles